ఒక ముఖ్యమంత్రిని,  ఆయన మంత్రి మండలిని మదింపు కట్టడం ఎలా ? అందులోనూ ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి ని ఎలా చూడాలి? ఈ ప్రశ్న చాలా కాలంగా రాజకీయ విశ్లేషకుల్లో ఉద్భవిస్తోంది. మంత్రి మండలి ముందున్న లక్ష్యాలు, ఇప్పటి వరకూ ఎం సాధించారు.  లక్ష్యసాధనకు చేసిన కృషి ఇత్యాది విషయాల ఆధారంగా  మంత్రి మండలిని మదింపు చేస్తారు. ఉన్నత శిఖరాలకు గురి పెట్టడం అనేది  భారత్ లోని రాజకీయ నాయుకులు నిత్యం చేసే పని.
విస్తృత స్థాయిలో జరిగిన ప్రచార ఉధృతి కారణంగా సహజంగాన్ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  పరిపాలన పైన, సభా నాయకుడిగా ఆయన దక్షత పైన ప్రజలు చాలా ఆశలే పెట్టుకున్నారు. జగన్ మోహహన్ రెడ్డి పై జనం పెట్టుకున్న ఆశలను ఆయన వమ్ము చేయలేదు. తన సింగిల్ పేపర్ అజండా  లో ప్రకటించిన ప్రణాళికలన్నీ దాదాపుగా అమలు చేశారాయన.
పనితీరుకు గీటురాళ్లుగా చెప్పుకోవలసిన అంశాలలో  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశించినంత , మెరుగైన పనితీరు కనబర్చ లేక పోయిందనే అపవాదును ముటకట్టుకున్నది. ఈ విషయాన్ని ఆయన పార్టీ  ప్రజాప్రతినిధులే  పేర్కోంటున్నారు. కాకపోతే వారు ఈ విషయాన్ని, తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించ లేకున్నారు.
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంత్రి మండలి ఉన్నా... అందులోని సభ్యులంతా  తమ శాఖా పరమైన నిర్ణయాలను  సొంతంగా తీసుకున్న దాఖలాలు లేవు.  ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క అంశం కూడా ముఖ్యమంత్రి మీదనే ఆధార పడి  పనిచేశారనేది బహిరంగ రహస్యం.  ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. ఏదేనీ ఒక శాఖ పనితీరును ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్న సమయంలో ఆశాఖ మంత్రి  హాజరు కావడం పరిపాటి. ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన సమీక్షలకు సదరు మంత్రులు హాజరు కాని సందర్భాలు చాలా ఉన్నాయి. అంతే కాదు. వివిధ శాఖలకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునే నిమిత్తం  ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేసిన సందర్భంలోనూ సదరు మంత్రులు  హాజరు కాలేదు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు  ప్రశ్నిస్తే.. అంతా మా ముఖ్యమంత్రి చూసుకుంటున్నారు కదన్నా... దాన్నెందుకు మీరు పదే పదే అడుగుతుంటారు.. అన్న  సమాధానాలు మంత్రులు ఇచ్చారు. ఇవన్నీ కూడా  ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లకు తెలిసిన విషయాలే.
మంత్రి వర్గంలో సీనియర్ మంత్రులున్నా కూడా... వారి ఇతర మంత్రులకు ఎలాంటి సహకారం కానీ, మార్గదర్శకం కానీ అందించ లేదన్నది సుస్పష్టం.
ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి ఒక సూపుర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అన్నీ తానే అయి పరిపాలన సాగిస్తున్నారు. అన్ని నిర్ణయాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.  ఇందులో మంచి ఎంత ఉందో... చెడు కూడా అంతే ఉంది. రాజధాని బిల్లును వెనక్కి తీసుకున్న వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. తాజాగా మరో బిల్లును  ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది కూడా. ఇది ముఖ్యమంత్రి సత్తా  చాటేందుకు సరైన సమయం వచ్చినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: