రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ మీద భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ ఫోకస్ చేసి కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా తీసుకొస్తుంది. ఈ నేపధ్యంలోనే కొన్ని రాజకీయ అంశాలకు సంబంధించి కూడా దృష్టి సారించారు. రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కేంద్రం దృష్టి పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి ఏపీ వ్యవహారాల మీద దృష్టి పెట్టడం అనేది కాస్త ఆసక్తిని రేపుతున్న అంశంగా చెప్పాలి. ఇక తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు కీలక వ్యాఖ్యలు చేసారు. టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ లేదు అని త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకువస్తామన్నారు  కిషన్ రెడ్డి .

దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ టూరిజంకి మంచి అవకాశాలున్నాయి అని ఆయన తెలిపారు.  ఇప్పటికే శ్రీశైలం సింహాచలం త్వరలోనే అన్నవరం, ప్రసాదం స్కీం కింద నిధులు మంజూరు చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. మహాయాన బుద్ధిష్ట్ సర్క్యూట్ ని అభివృద్ధి చేస్తాం అని తెలిపారు. కాకినాడ, నెల్లూరులో, బీచ్ కోస్టల్  కారిడార్  అభివృద్ధి చేస్తాం అని పేర్కొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ నుండి రాష్ట్రానికి సుమారుగా 234 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు కేంద్ర మంత్రి. ఏపీ పర్యాటక రంగంగా అబివృద్ది చెందే అవకాశం ఉంది అని తెలిపారు.

27 కోట్ల రూపాయలు అమరావతి లో బౌద్ధ క్షేత్రంలో అబివృద్ది చేస్తున్నాం అని వివరించారు. విశాఖ పర్యటకంగా పూర్తి స్థాయిలో అబివృద్ది చెందుతుంది అని తెలిపారు. టూర్ ఆపరేటర్లకు 10 లక్ష రూపాయల,గైడ్ లకు లక్ష రూపాయలు లోన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. 18 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం నిర్మాణం చేయబోతున్నాం అని అమరావతి రాజధాని విషయంలో సోము వీర్రాజు  ప్రకటించిన  నిర్ణయమే మా నిర్ణయం అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: