ఏద‌యినా ప‌రిశ్ర‌మ‌కో లేదా మ‌రోదానికో సంబంధించి భూములు ఇచ్చాక ఎవ్వ‌ర‌యినా రోడ్డున ప‌డతారు కానీ ఇక్క‌డ ఇచ్చింది స‌ర్కారుకే క‌నుక ఎటువంటి ఇబ్బందులూ లేకుండానే ఒడ్డెక్కిపోతాం అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. భూములు ఇచ్చాక అనూహ్యంగా రైతు ప‌రిస్థితి మారిపోతుంది అనుకున్నారు. అదికూడా లేదు రాజ‌ధాని రైతు విష‌యంలో! పాపం ఇప్పుడు వీరంతా రోడ్డున ప‌డి అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయినా కూడా ఏది రాజ‌ధానో తేల్చ‌డం లేదు. ఒక రోజు మూడు మ‌రో రోజు రెండు ఇలా రోజుకో అంకె చెప్పి మాడు ప‌గుల‌గొడుతున్నారు. దీంతో ఏం చేయాలో ఎవ‌రికి త‌మ గోడు చెప్పుకోవాలో అన్న‌ది అర్థం కాక రాజ‌ధాని రైతులు న్యాయ స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ న‌డుస్తూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అన్న‌ది దొర‌క‌డం లేదు.


జ‌గ‌న్ చెప్పిన‌వాటికీ చేసిన వాటికీ సంబంధం అన్న‌ది లేక‌పోవ‌డంతో ఎప్పుడు ఏ ప్ర‌మాదం ముంచుకువ‌స్తుందో అని వీరంతా హ‌డ‌లిపోతున్నారు. భూముల‌న్నీ ప్ర‌భుత్వాన్ని న‌మ్మి ఇచ్చిన‌వేన‌ని వీటి వ‌ల్ల తాము న‌ష్ట‌పోవ‌డ‌మే కాకుండా ప్ర‌తిరోజూ తీవ్ర ఒత్తిడిని చవి చూస్తున్నామ‌ని చెబుతున్నారు రాజ‌ధాని రైతులు. ఈ నేప‌థ్యంలో భూములిచ్చిన రైతులంతా ఇప్పుడు డైలామాలో ప‌డిపోయారు. రాజ‌ధానికి సంబంధించి ఏ నిర్ణ‌యం వెలువ‌రించ‌కుండా ఏడున్న‌రేళ్లుగా ఏదో ఒక విధంగా తాము అవ‌స్థ ప‌డుతున్నామ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇక‌పై ప్ర‌భుత్వ ప‌నుల‌కు కానీ ప్రాజెక్టుల‌కు కానీ భూములు ఇవ్వాలంటేనే భ‌య‌ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు రైతులు. క‌నుక ప్రాజెక్టుల పేరిటో ప‌రిశ్ర‌మ‌లో పేరిటో రాజ‌ధాని నిర్మాణాల పేరిటో భూములు లాక్కోవ‌డం అన్న‌ది మానుకుంటే మేలు అని హిత‌వు చెబుతున్నారు రైతులు మ‌న నాయ‌కుల‌కు..ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో
మూడు రాజ‌ధానుల బిల్లు ర‌ద్దు అయ్యాక, ప్ర‌భుత్వం తన నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న‌ప‌డ్డాక ఇక‌పై ప‌రిణామాలు కూడా మారిపోను న్నాయి. ముఖ్యంగా రాజ‌ధానికి భూములు ఇచ్చి అవ‌స్థ ప‌డుతున్న రైతుల‌కు ఇదొక గుణ‌పాఠం అయిపోయింది. ఎందుకంటే ఏ కార‌ణం అయినా వాళ్లు భూములు ఇచ్చారు వీళ్లు తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్లు ఇచ్చారు కాదు వాళ్లు ఇచ్చేలా చే శారు వీరు లాక్కున్నారు. ఇది త‌ప్ప రాజ‌ధాని విష‌య‌మై జ‌రిగిందేమీ లేదు. పాపం ఆ రైతుల‌కు ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు వీళ్లంతా అమ‌రావ‌తి రైతు ప‌రిర‌క్ష‌ణ స‌మితి పేరిట రోడ్డెక్కుతూ నానా అవ‌స్థ‌లూ ప‌డుతుంటే పాపం చాలా మందికి వినోదంగా ఉంది. ఇంకొంద‌రికి అప‌హాస్యంగానూ ఉంది. ఇప్పుడేం చేయ‌మంటారు మీరే చెప్పాలి జ‌గ‌న్ గారూ!
మరింత సమాచారం తెలుసుకోండి:

ycp