జ‌గ‌న్ ల‌క్ష్యానికి జ‌య‌హో.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. నిజానికి సోమ‌వారం నాటి అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసేందుకురెడీగా ఉంద‌నే వార్త‌లు రావ‌డంతో అటు ఉత్త‌రాంధ్ర‌లోను, ఇటు.. సీమ‌ల్లోనూ ప్ర‌జ‌లు ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. ఎందుకంటే.. రాష్ట్రంలో సీమ ప్రాంతం నుంచి అనేక మంది ముఖ్య‌మంత్రులు ప‌నిచేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రూ ఇక్క‌డ ప్ర‌తిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్న‌ది లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని ప్ర‌క‌టించారు. ఇక‌, వెనుక బ‌డిన జిల్లాలుగా దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి వినిపిస్తున్న విల‌పిస్తున్న జిల్లాలు ఉత్త‌రాంధ్ర జిల్లాలు.

ఇక్క‌డ కూడా అనేక మంది నాయ‌కులు ఉన్నారు. కేంద్రంలోనూ చ‌క్రం తిప్పారు. రాష్ట్రంలోనూ చ‌క్రాలు తిప్పుతున్నారు. కానీ, ఎవ‌రూ కూడా అనూహ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకున్న‌ది లేదు. ఇప్పుడు చేస్తున్నదే చాలు.. అనే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించిన నాయ‌కులు ఉన్నారు. పైగా ఒడిసా వంటి కీల‌క రాష్ట్రంతో ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు ఉన్న వివాదాలు, విభేదాల‌ను ప‌రిష్క‌రించేందుకు ఏ విజ‌న‌రీ నాయ‌కుడు కూడా ప్ర‌య‌త్నించ‌లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇటీవ‌ల ఒడిసా ముఖ్య‌మంత్రితో భేటీ అయి.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్టారు. అదేవిధంగా విశాఖ‌ను ప్ర‌ధాన రాజ‌ధాని చేయ‌డం ద్వారా.. ఉత్త‌రాంధ్ర ముఖ పీఠిక‌పై స‌రికొత్త అభివృద్ధి తతిల‌కం దిద్దాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ రెండు ప‌రిణామాల‌ను అటు సీమ‌లోను. ఇటు ఉత్త‌రాంధ్ర‌లోనూ.. ప్ర‌జ‌లు స్వాగతిస్తున్నారు. ఇప్పుడు.. ఒక్క‌సారిగా మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం వెన‌క్కి తీసుకుంటార‌నే ప్ర‌తిపాద‌న రావ‌డంతో వారిలో స‌హ‌జంగానే భావోద్వేగం వ‌చ్చింది. అయితే.. సీఎం జ‌గ‌న్ తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న‌తో వారు ఒకింత ఊర‌డిల్లారు. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌జ‌ల నుంచి ముఖ్యంగా ఆ రెండు ప్రాంతాల ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ట్టుగానే చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మయంలో అమ‌రావ‌తి ఎక్క‌డికీ పోద‌ని.. తాను అభివృద్ది చేసి తీరుతాన‌ని చెప్ప‌డం ద్వారా.. ఇటు విజ‌య‌వాడ‌.. అటు గుంటూరు ప్ర‌జ‌లు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సో.. మొత్తానికి జ‌గ‌న్ ల‌క్ష్యానికి ప్ర‌జ‌ల నుంచి జ‌య‌హో నినాదాలే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: