బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ బలోపేతం చేసే క్రమంలో కొంతమంది కీలక నాయకులు ఆయనకు సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి ఆయన సహకారం లేదని పైగా వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఎక్కువగానే ఉన్నాయని ఎవరి ప్రచారం వాళ్ళు చేశారు. రాజకీయంగా పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర అధ్యక్షుడు సహకరిస్తే కచ్చితంగా పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

అయితే గత కొన్ని రోజులుగా బండి సంజయ్ ఒంటరి పోరాటం చేయడమే గాని పార్టీలో ఉన్న కీలక నాయకులు ఎవరూ కూడా బండి సంజయ్ తో పాటుగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విషయంలో చాలా వరకు కూడా వెనుకడుగు వేశారంటే చెప్పాలి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వత్తిడి చేసేందుకు బండి సంజయ్ పలు జిల్లాల పర్యటనకు వెళ్లినా సరే బిజెపి లో ఉన్న కీలక నాయకులు బయటకు రాకపోవడంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

అయితే బండి సంజయ్ విషయంలో కొన్ని అంశాలకు సంబంధించి బిజెపి కేంద్ర నాయకత్వం లో చాలా నమ్మకం ఉందని బండి సంజయ్ పార్టీని బలోపేతం చేస్తారని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారని అందుకే ఆయనకు ఎవరు సహకరించినా సహకరించకపోయినా సరే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బండి సంజయ్ రెండో దశ పాదయాత్ర కూడా త్వరలో మొదలు కానున్న నేపథ్యంలో బిజెపి కేంద్ర నాయకత్వం పార్టీ నేతలతో ఒక సమావేశం నిర్వహించి బండి సంజయ్ పూర్తిస్థాయిలో మార్గం సుగమం చేసేందుకు రెడీ అవుతోందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: