ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు సమర్థవంతంగా మాట్లాడలేకపోవడం కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి సమర్థవంతంగా వ్యవహరించ లేకపోవడం వంటివి ఇప్పుడు కాస్త ముఖ్యమంత్రి జగన్ ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనే మాట వాస్తవం. కొన్ని కీలక అంశాల్లో కొంతమంది సీనియర్ మంత్రులు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు సహకరించక పోవడం అనేది ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. అయితే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా సానుకూలంగా ఉన్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు చేస్తున్నాయి.

ముఖ్యంగా కీలక అంశాలకు సంబంధించి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సానుకూలంగా వ్యవహరించటం కాకుండా కొన్ని కొన్ని కీలక బాధ్యతలను ఆయనకు ఇస్తున్నారని ఆర్థిక శాఖ ఇబ్బందులు పడుతున్న సరే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్ధిక శాఖను గట్టెక్కించే సామర్థ్యం ఉన్న నాయకుడు అని జగన్ నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ మంత్రులు సలహాలు కంటే కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సలహాలను ముఖ్యమంత్రి జగన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక శాసనసభలో కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సలహాలను జగన్ ఎక్కువగా పాటిస్తూ ఉంటారని వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా కీలక ప్రకటన చేసే ముందు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో ఏకాంతంగా జగన్ మాట్లాడిన తర్వాత అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా పార్టీలో కూడా కొన్ని కీలక సూచనలు సలహాలు కు సంబంధించి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యంగా జగన్ పరిస్థితి ఉంటుందనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. ఇక అప్పుల విషయంలో అధికారులు కంటే కూడా బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సామర్థ్యాన్ని జగన్ ఎక్కువగా నమ్ముతూ ఉంటారని అందుకే ఢిల్లీ ఎక్కువగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్తూ ఉంటారని రాజకీయ వర్గాల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: