ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొంత మంది మంత్రుల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ గా ఉన్నారని ప్రచారం మనం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది మంత్రులు జగన్ కు పూర్తి స్థాయి లో సహకారం అందించటం లేదనే విషయం క్లియర్ గా అర్థం అవుతూ ఉంటుంది. రాజకీయంగా పార్టీని ముందుకు నడిపించే విషయంలో జగన్ కు కొంతమంది సీనియర్ నేతల నుంచి సహకారం అందిస్తున్న ప్రభుత్వం ముందుకు నడిపించే విషయంలో మాత్రం జగన్ కు సహకారం లేదనే భావన వ్యక్తమవుతోంది.

ఏదైనా కీలక నిర్ణయం తీసుకున్న సమయంలో జగన్ సలహా ఇస్తే మాత్రమే కొంత మంది మాట్లాడే పరిస్థితి ఉంటుందని జగన్ మాట్లాడమంటే మాత్రమే మీడియా ముందుకు వెళ్తారని లేకపోతే మాత్రం పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదని ఇటువంటి మంత్రుల విషయంలో జగన్ ని చూసి చూడనట్టుగా ఇన్ని రోజులు వెళ్లారని కానీ ఇకముందు మాత్రం అలా వెళితే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు రావచ్చని అంటున్నారు.

కొంతమంది ప్రభుత్వంలో అనుభవం ఉన్న మంత్రులు కూడా జగన్ కు సహకరించకపోవడంతో ప్రభుత్వంలో జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారని కొన్ని కీలక బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కూడా చిన్నచిన్న సలహాలు ఇచ్చే పరిస్థితిలో కొంత మంది మంత్రులు లేరని అంటున్నారు. రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ మంత్రి వర్గాన్ని కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ ప్రక్షాళన చేయకపోతే మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో ఉన్న కొంత మంది మంత్రుల నుంచి సరైన సహకారం అందకే ఇన్ని ఇబ్బందులు వచ్చాయి అనే మాట కూడా వినపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: