ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. కొన్ని కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది నుంచి సహకారం లేదనే వ్యాఖ్యలు ఎప్పటినుంచో కనబడుతూనే ఉన్నాయి. రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అడుగులు వేసే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ప్రభుత్వం నిర్వహించే విషయంలో ముఖ్యమంత్రి జగన్ కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి... సమర్థవంతమైన సలహాలు ఇచ్చే పరిస్థితిలో సలహాదారులు లేరనే భావన కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది.

ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మినహాయిస్తే మిగిలిన వారెవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన సలహాలు ఇచ్చే పరిస్థితి లేదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్  కొన్ని కొన్ని విషయాల్లో సమర్థవంతంగా ఉన్నా సరే మరి కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నారని అంటున్నారు. ఇక కీలక శాఖల్లో ఉన్న సలహాదారులు పెద్దగా సహకారం అందించకపోవడంతో కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అనే భావన కూడా వ్యక్తమవుతుంది.

న్యాయపరమైన సలహాలు విషయంలో గానీ రాజ్యాంగపరమైన సలహాలు విషయంలో గానీ చాలామంది మంత్రుల నుంచి గాని జగన్ కు సరైన సలహాలు లో అందటం లేదనే భావన కూడా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని దానికి సంబంధించి కూడా జగన్ కు సలహాదారుల నుంచి పూర్తి సలహాలు రావడం లేదనే భావన కొంత వరకు ఉంది. భవిష్యత్తులో ఆయన సలహాదారులు జగన్ కు సమర్థవంతంగా సహకారం అందించకపోతే మాత్రం కచ్చితంగా ప్రభుత్వంలో మరిన్ని ఇబ్బందులు జగన్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అనే మాట వాస్తవం. మరి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు ఉండబోతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp