భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్లోఎంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ పాకిస్తాన్లో ఒక మినీ సైజు యుద్ధమే జరుగుతుంది అని చెప్పాలి. ఒకప్పుడు ఉగ్రవాదులు కాశ్మీర్ ప్రాంతంలో నుంచి భారత్ లోకి అక్రమంగా చొరబడి భారీగా ఉగ్ర కుట్రలు చేసే వారు. కానీ ప్రస్తుత సమయంలో మాత్రం భారత ఆర్మీ కాశ్మీర్ ప్రాంతంలో ఎంతో అప్రమత్తంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వివిధ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉగ్రవాదులను మట్టుబెడుతూ ఉంది భారత ఆర్మీ. ఈ క్రమంలోనే ఇక కాశ్మీర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలి   అనుకున్న ఉగ్రవాదుల ఆటలు సాగడం లేదు అని చెప్పాలి.



 గత కొన్ని నెలల నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్న భారత ఆర్మీ ఉగ్రవాదులు భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేస్తూ వస్తోంది. ఇలా ఇప్పటివరకు కొన్ని నెలల సమయం లోనే వందల మంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో మట్టుబెట్టింది భారత సైన్యం. భారత సరిహద్దు లోకి అడుగు పెట్టాలి అని ఆలోచన వస్తే భయపడే విధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఊచకోత కోస్తుంది అని చెప్పాలి. అయినప్పటికీ వెనక్కి తగ్గని ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా భారత్ లోకి చొరబడేందుకు  ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో అటు ఉగ్రవాదులను కనుగొనేందుకు భారత సైన్యం వివిధ ఆపరేషన్ నిర్వహించి జల్లెడ పడుతూ ఉంది.


 ఇటీవలే జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఇక గత కొన్ని రోజుల నుంచి భారత సైన్యం ఉగ్రవాదులపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 11 మంది ఉగ్రవాదులను కేవలం వారం రోజుల వ్యవధిలోనే మట్టుబెట్టింది. ఇక ఇటీవల కుల్గాం లో కూడా భారత ఆర్మీ ఎన్ కౌంటర్ చేసింది. ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ ను భారత ఆర్మీ ఎన్ కౌంటర్ చేసింది. ఇలా ఉగ్రవాద నాయకులనే తుదముట్టించటం ద్వారా స్లీపర్ సేల్స్ లో కూడా భయాన్ని పుట్టించేందుకు భారత ఆర్మీ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: