ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ ఆధిపత్యాన్ని చేపట్టిన తర్వాత ఎంతటి అరాచక పాలన సాగిస్తున్నారో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. తాలిబన్లు రోజు రోజుకి తెరమీదకు తెస్తున్న ఆంక్షల తో ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యానికి గురి అవు తున్నాయి అని చెప్పాలి. ఇక రోజు రోజుకీ తాలిబన్ల రాక్షస పాలన మితి మీరి  పోతుంది అని చెప్పడం లో అతి  శయోక్తి లేదు. ముఖ్యం గా మహిళలను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు తాలిబన్లు. ఇప్పటికే మహిళలు ఎలా ఉండాలి అనేదాని పై కఠిన ఆంక్షలు అమలు లోకి తీసుకు వచ్చాను అన్న విషయం తెలిసిందే.


 మహిళలు ఉద్యోగాలు చేయ కూడదని.. చదువు కోవడం కూడా చేయ కూడదు అంటూ ఆంక్షలు పెట్టారు. కేవలం ఇంట్లో ఉంటు ఇంటి పనులు మాత్రమే చూసు కోవాలి అంటూ  తాలిబన్లు నిబంధనలు అమలు లోకి తీసుకు రావడం గమనార్హం. అంతేకాదు క్రీడలలో కూడా అమ్మాయిలు అస్సలు ఉండకూడదు అంటూ ఎన్నో అరాచకాలు సృష్టించారు. స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారిని సైతం దారుణంగా హత్య చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.



 ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు ఎవరు కూడా సీరియల్స్ సినిమాలలో నటించకూడదు అంటూ ఆంక్షలు విధించారు తాలిబన్లు. మహిళలు ఎవరు కూడా మేకప్ వేసుకుని తెరమీద కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. బుర్ఖా లేకుండా అసలు ఎక్కడా కనిపించకూడదు అంటూ తెలిపారు.. అంతే కాదు ఇక ఇలా  సినిమాలు సీరియల్ లో నటిస్తున్న మహిళలను తప్పించే విధంగా ఇక కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో కూడా మహిళలు ఉండకూడదు అంటూ కఠిన అంశాలను అమల్లోకి తీసుకు వచ్చి మహిళల జీవితాన్ని మరింత దుర్భరంగా మార్చేశారు  తాలిబన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: