కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పేద ప్రజలందరికీ కూడా అండగా నిలిచే విధంగా ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టింది. ఇక ఇలా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో కళ్యాణ లక్ష్మి పథకం కూడా ఒకటి. పేదింటి ఆడబిడ్డలు తల్లిదండ్రులకు అందరికీ కూడాఎంతో అండగా ఉండే విధంగా కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కళ్యాణ లక్ష్మి పథకం లో భాగంగా ముందుగా 50 వేల రూపాయలు పెళ్లి కూతురు తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున ఇచ్చింది.


 అయితే ఈ 50 వేల రూపాయలు అటు సరిగ్గా పెళ్ళికి ఒకరోజు ముందుకు పెళ్ళికూతురు తల్లిదండ్రులకు చేరే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. కొన్ని రోజుల వరకు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఒక్కసారిగా పెళ్లికి ముందు రోజు అమ్మాయి తల్లిదండ్రుల చేతికి కళ్యాణలక్ష్మీ డబ్బులు అందేవి. అయితే ఆ తర్వాత కాలంలో కల్యాణలక్ష్మి డబ్బులను 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో పేద ప్రజలు అందరూ ఎంతగానో హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత మాత్రం పెళ్లికి ఒక రోజు ముందు కల్యాణలక్ష్మి డబ్బులు అందటం కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.


 తర్వాత కాలంలో పెళ్లి జరిగిన నెలల తర్వాత కళ్యాణలక్ష్మీ డబ్బులు పంపడం లాంటి జరిగింది. ఇక ఇప్పుడు ఏకంగా సంవత్సరాలు గడిచి పోతుంది కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తాను అని చెప్పిన కళ్యాణలక్ష్మీ చెక్కులు మాత్రం అందడం లేదు అన్నది అర్థం అవుతుంది. పెండింగ్లో ఒక లక్ష 11 వేల నూట డెబ్భై ఒక్క అప్లికేషన్లు ఉన్నాయి అన్న విషయం  బయటకు వచ్చింది. ఏడాది గడుస్తున్నా కూడా కల్యాణలక్ష్మి రాక అటు పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా కెసిఆర్ పథకాలే శాపంగా మారిపోతున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: