ఇంట గెలిచి రచ్చ గెలువు... తెలంగాణ రైతులు ఆత్మహత్య లు చేసుకుంటే కుటుంబాలను పరామర్శించలేదు... పంజాబ్ రైతుల గురించి మాట్లాడుతున్నావని కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు డీకే అరుణ.  ఏ ప్రకటనలు అయిన రాజకీయం కోసం, ప్రచారం కోసం మాత్రమేనని... కేసీఆర్ పథకాలు పేపర్ లకు మాత్రమే పరిమితమని ఆగ్రహించారు.  రైతు రుణమాఫీ, డబల్ బెడ్రూం ఇళ్లు, గొర్లు ఎక్కడ కేసీఆర్ అని... కేసీఆర్ కు రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.  రైతులకు అన్యాయం చేసే పని కేంద్రం చేయదని... మెడికల్ కాలేజ్ ల గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ప్రపోజల్స్ పంపించావా అని నిలదీశారు డీకే అరుణ.  

తమ నాయకులు ఉన్న చోట మెడికల్ కాలేజి లు ప్రకటించుకున్నారని..ఏరియా హాస్పిటల్స్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ చేస్తా అంటివి.. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటివి ఏవి అని నిలదీశారు.  కేసీఆర్ గురివింద నీతి మంచిది కాదని.... అబద్ధాల, మోసగాడు ముఖ్యమంత్రి పెరుపొందారని ఆగ్రహించారు.  


కేసీఆర్ కుటుంబానికి దేశభక్తి ఉన్నదా... అరుణాచల్ ప్రదేశ్ పై ఏమి మాట్లాడారని... మీకు ఉన్నదంతా ప్రజల్లో సెంటిమెంటును రెచ్చగొట్టాలి... దానితో బతకాలని చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఎన్ని వేషాలు వేసిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు... కర్మ చూడు.. నిన్ను ధర్నా చౌక్ కి తీసుకొచ్చింది బీజేపీ  అని ఫైర్ అయ్యారు డీకే అరుణ. ప్రజా స్వామ్యాన్ని ఖుని చేసిన నీకు ధర్నా చేసే అధికారం లేదని... ప్రధాని కి ని లాగా చిన్న బుద్ధి లేదు... ఆయన తెలంగాణ కోసం ఎప్పుడు అడిగిన టైం ఇస్తారన్నారు. దేశమంతా పబ్లిసిటీ కోసం కేసీఆర్ కొత్త స్టంట్ మూడు లక్షల నష్టపరిహారమని... హామీలు ఇచ్చేది కేసీఆర్... చేయడం లేదని నెపం మోపేది కేంద్రం అన్నారు. స్థానిక ఎమ్మెల్సీ కోట లో మాకు సంఖ్యా బలం లేదు...నైతికంగా మంచిది కాదనే పోటీ చేయడం లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: