గత కొంతకాలం నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో చైనా కవ్వింపు లకు  పాల్పడుతుంది  అనే విషయం తెలిసిందే. ఇప్పటికే సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే పలుమార్లు చైనా భారత్ మధ్య చర్చలు జరిగాయి. ఇక చర్చ జరిగిన సమయంలో తామువెనక్కి తగ్గుతాము అంటూ ఒప్పందం చేసుకున్న చైనా ఆ తర్వాత మాత్రం మళ్లీ డబుల్ గేమ్ ఆడుతూ ఉండటం గమనార్హం. సరిహద్దుల్లో భారీగా ఉండటం యుద్ధ విమానాలను సైతం మోహరిస్తోంది. ఇలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా చైనాతో యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ ని ఎంతో పటిష్టంగా కేంద్ర ప్రభుత్వం మార్చుకుంటుంది.


 ఈ క్రమంలోనే ఒకవైపు స్వదేశీ ఆయుధాలకు ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేర్చడమే కాదు విదేశీ ఆయుధాలను సైతం కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా భారత దేశ తీర ప్రాంత రక్షణ ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది భారత్.ఇక ఇటీవల యుద్ధంలో బ్రహ్మాస్త్రంగా చెప్పుకునే ఒక యుద్ధ నౌక భారత అమ్ముల పొదిలో చేరింది. ఐ ఎన్ ఎస్  విశాఖపట్నం భారత నావికా దళం లో చేరింది. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు నౌకాదళ ఉన్నతాధికారులు కూడా ఐ ఎన్ ఎస్ విశాఖపట్నం ప్రారంభించారు.



 అయితే సంప్రదాయం ప్రకారం ప్రస్తుతం ముంబైలో మజాగాన్ దాక్ లో  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నౌకలకు ప్రముఖ నగరాలు పేర్లు పెడుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ అధునాతన టెక్నాలజీతో కూడిన నౌకకు ఐ.ఎన్.ఎస్ విశాఖపట్నం అని నామకరణం చేశారు. ఇక ఐ ఎన్ ఎస్ విశాఖపట్నం రాకతో తూర్పు నావికాదళం రెట్టింపు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఐ ఎన్ ఎస్  విశాఖపట్నం ప్రస్తుతం భారత అమ్ములపొదిలో చేరడంతో చైనా కవ్వింపు లకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: