ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి రద్దు వ్యవహారం అనేది గత ఏడాది నుంచి హాట్ టాపిక్ అయిన నేపధ్యంలో నేడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం అయింది. పార్లమెంట్ వద్దకు కూడా బిల్లు పంపిన ఏపీ సర్కార్ కాస్త సీరియస్ గా ఈ విషయంలో దృష్టి సారించింది. అయితే అనూహ్యంగా మండలిలో తమ బలం పెరగడం తో ఏపీ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి వెనక్కు తగ్గింది అనే చెప్పాలి. ఇక మండలి రద్దు తీర్మానం ను వెనక్కు తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ఈ సందర్భంగా సభలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ 1958 లో మండ‌లి ఏర్ప‌డింది అని తెలిపారు.

ఎన్టీఆర్ హ‌యాంలో 1986 లో మండ‌లిని వివిధ కార‌ణాల వ‌ల్ల ర‌ద్దు చేశారు అని ఆయన గుర్తు చేసారు. 2006లో అప్ప‌టి ప్ర‌భుత్వం వైఎస్ ఆర్ తిరిగి మండ‌లిని ఏర్పాటు చేశారు అని పేర్కొన్నారు. ఈ ప్ర‌భుత్వం చారిత్రాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకోగా అవి వివిధ కార‌ణాల్లో డిలే అయ్యాయి అని తెలిపారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డిన‌వారు ప్ర‌జ‌ల‌కు సుప్రీం రిప్ర‌జెంటేటివ్ లు అని ఆయన స్పష్టం చేసారు. ప్ర‌జ‌ల‌కోసం మంచి నిర్ణ‌యం, చ‌ట్టం తీసుకోవాల‌నుకున్నా, కాలాన్ని బ‌ట్టి స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంది అని తెలిపారు.

ప్ర‌జ‌ల ఆశ‌లకు అనుగుణంగా చ‌ట్టాలు చేయాల్సిన భాద్య‌త‌ లోక్ సభ‌, అసెంబ్లీల‌కు ఉంటుంది అని పేర్కొన్నారు. వీటిపై మండ‌లి ప‌లు సూచ‌న‌లు చేయాల్సి ఉంటుంది అని ఆయన వివరించారు. అసెంబ్లీలో డాక్ట‌ర్లు, లాయ‌ర్లు తో పాటు అన్నివర్గాల మేధావులు వ ఎంతో మంది వున్నారు అని దీనితో మండలి రద్దు పై జనవరి 27, 2020 న మండలి రద్దు తీర్మానం చేసి పంపాము అని అన్నారు. అయితే అనేక కారణాలతో అది డిలే అయింది అని పేర్కొన్నారు. దీనితో మండలి ముందుకు వెళ్లాలా వద్ద అనే సందిద్దత ఏర్పడింది అనివివరించారు. చివరకు మండలి కొనసాగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap