బీసీ గణన విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విపక్షాలు కాస్త గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి సిఎం వైఎస్ జగన్ కూడా కేంద్రాన్ని పలు మార్లు డిమాండ్ లు చేస్తూ వస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి జాప్యం చేస్తుంది అనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. ఇక బిసి జ‌న‌గ‌ణ‌న తీర్మాణం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. బిసి ల జ‌నాభా దేశంలోనే 52 శాతం ఉంటుంది అనేది ఓ అంచనా అని అన్నారు ఆయన. 1931 లో బ్రిటిష్ కాలంలో కులప‌ర‌మ‌యిన జ‌నాభా లెక్కించారు అని ఆయన తెలిపారు.

అప్ప‌టి నుండి ఇప్పటిదాకా బిసి ల జ‌నాభా సుమారుగా అనే లెక్కిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. విద్యాప‌రంగా, సామాజికంగా, రాజ‌కీయంగా, ఆర్ధికంగా లెక్క తెలియ‌డం లేదు అని అన్నారు జగన్. రాజ్యంగా అమ‌లుకోకి వ‌చ్చిన నాటినుండి బిసిల గ‌ణ‌న జ‌ర‌గ‌లేదు అని తెలిపారు. 2020లో జ‌నాభా లెక్క‌లు జ‌ర‌గాలి కోవిడ్ వ‌ల్ల ఆల‌స్యం అయ్యాయి అని అన్నారు జగన్. ఈసారి జ‌నాభా లెక్క‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కులాన్ని ప్ర‌క‌టించేలా లేదా కేంద్ర‌మే అడ‌గాలని కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు వెళ్ళాయి అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర స్ధాయిలో జ‌న‌గ‌ణ‌న‌కు ప్ర‌త్యేక విధానం ఉండ‌దు  అందుకే కేంద్రాన్ని కోరుతున్నాం అని పేర్కొన్నారు. ఈస‌భ‌లో ఏక‌గ్రీవం గా తీర్మానం  కేంద్రానికి పంపుతున్నాము అని అన్నారు. కేంద్రం బిసి గ‌ణ‌న చేప‌ట్టాల‌ని కోరుతున్నాము అన్నారు జగన్. గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ఏదో చేసామంటే చేసామ‌ని, ఇచ్చామంటే ఇచ్చామ‌న్న‌ట్టు ఇచ్చారు అని టిడిపి పాల‌న అయిదేళ్ళ‌లో రాజ్య‌స‌భ‌ను ఒక్క బిసిని పంప‌లేక‌పోయారు అన్నారు. బిజి జ‌న‌గ‌ణ‌న తీర్మానాన్ని  ఆమోదించిన శాస‌న స‌భ  అని కొనియాడారు. కౌన్సిల్ ఛైర్మ‌న్ నుండి అందిన స‌మాచారం మేర‌కు ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ ర‌ద్దు బిల్లు, సిఆర్డీఏ ర‌ద్దు బిల్లు ర‌ద్దు చేస్తూ కౌన్సిల్ ఓ ఆమోదం తెలిపిన‌ట్టు  స్పీక‌ర్ ప్రకటన చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: