రైతు ఉద్యమం. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ... రైతులు దేశ రాజధానిని ముట్టడించారు. దేశ వ్యాప్తంగా నిరసనలు చేశారు. ఎర్రకోటపై దాడి చేశారు. పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఎండా, వానా, చలి అనే తేడా లేకుండా అహో రాత్రులు రైతులు ఆందోళనలు చేశారు. భారత్ బంద్ కూడా చేశారు. రైతు ఆందోళన దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. చివరికి అంతర్జాతీయ మీడియా కూడా రైతు ఆందోళన వార్తలను హైలెట్ చేశాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. చివరికి కొత్త చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లులను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే రైతులు మాత్రం బిల్లులు పూర్తిగా రద్దు అయ్యే వరకు తమ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. రైతు ఆందోళనపై ఇప్పటికే కేంద్రానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు కూడా వేసింది. ఇప్పుడు న్యూస్ ఛానల్స్‌కు కూడా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఏడాది కాలంగా నిరసనలు చేస్తున్నారు. అయితే రైతు ఉద్యమంపై జీ న్యూస్ శాటిలైట్ ఛానల్ వివాదాస్పద వీడియోలను ప్రసారం చేసింది. అయితే ఈ వీడియోలపై ఎన్‌బీడీఎస్ఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనైతిక ప్రమాణాల్ని ఎలా ప్రసార చేశారని జీ న్యూస్ యాజమాన్యాన్ని తప్పుబట్టింది. వార్తా ప్రసార ప్రమాణాలను ఉల్లంఘించేలా వీడియోలు ఉన్నాయని న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అథారిటీ వెల్లడించింది. తక్షణమే వాటిని తొలగించాలని జీ న్యూస్ యాజమాన్యాన్ని ఆదేశించింది. రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఖలిస్తాన్ ఉద్యమానికి లింక్ చేసేలా ఉన్న వీడియోలపై ఎన్‌బీడీఎస్ఏకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సామాజిక కార్యకర్త ఇంద్రజీత్ ఘోర్పడే చేసిన ఫిర్యాదుపై ఈ రోజు ఎన్‌బీడీఎస్ఏ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ శాటిలైట్ ఛానళ్ల ప్రసారాలను సమీక్షించేందుకు న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ డిజిటల్ స్టాండర్స్ అథారిటీ స్వచ్ఛందగా ఏర్పడిన సంస్థ. ఛానళ్లలో ఏవైనా అభ్యంతరకరమైన ప్రసారాలు ఉంటే... వాటిపై ఎన్‌బీడీఎస్ఏ తగిన నిర్ణయం తీసుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: