చాలా రోజుల నుంచి వినిపిస్తున్న మాట ఇది. కానీ దీనిపై ఎవ్వ‌రూ స‌రిగా స్పందించ‌డం లేదు. ముఖ్యంగా రాజ‌ధాని రైతుల‌కు సంబంధించి వైఎస్ జ‌గ‌న్ వ‌ర్గాలు చెబుతున్న మాట‌లు ఏవీ కూడా అంత స‌మంజ‌సంగా లేవు. రైతుల పై ఆయ‌న‌కు ప్రేమ లేకున్నా ప‌ర్లేదు కానీ వారి ఉద్య‌మాన్నో వారి క‌ద‌లిక‌ల‌నో త‌గ్గించి త‌క్కువ చేసి మాట్లాడ‌డం త‌గ‌ని ప‌ని. ఇదే కోవలో రైతు ఉద్య‌మాల‌ను కించ‌ప‌రుస్తూ జ‌గ‌న్ తో పాటు ఇంకొంద‌రు మాట్లాడ‌డం కూడా త‌గ‌ని ప‌ని. మ‌రి! ఆ రోజు ఆయ‌న ఓదార్పు యాత్ర ను కానీ పాద‌యాత్ర‌ను కానీ కించ‌ప‌రిచి మాట్లాడితే త‌ట్టుకునేవారా లేదా అవ‌న్నీ రాజ‌కీయంలో భాగ‌మేన‌ని వ‌దిలిపెట్టేవారా?

అంతేకాదు రాజ‌ధాని రైతుల‌ను జ‌గ‌న్ కార్పొరేట్ రైతులు అని వ్యాఖ్యానించ‌డం కూడా త‌గ‌దు. ఎందుకంటే మూడు పంట‌లు పండే నేల‌ల‌ను టీడీపీ చెప్పింద‌నో చంద్ర‌బాబు ఒప్పించార‌నో ఏదో ఒక విధంగా వీళ్లంతా ముందుకు వ‌చ్చి త‌మ ఒప్పందంను అప్ప‌టి ప్ర‌భుత్వంతో కుదుర్చుకున్నారు. దుర‌దృష్ట‌మో అదృష్ట‌మో అధికారం వైసీపీకి ద‌క్కాక వీరి జీవితాలే మారిపోయాయి. దీంతో కాలానుగుణ ప‌రిణామాల్లో భాగంగా రాజ‌ధాని రైతులు ఊళ్ల‌కు ఊళ్లు ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తూ నిర‌స‌న‌ల‌తో హోరెత్తించారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం దిగిరాక‌పోగా బొత్స, పెద్ది రెడ్డి లాంటి లీడ‌ర్లు వారిపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. ఫ‌లితంగా గొడ‌వ రోజురోజుకీ పెరుగుతుందే త‌గ్గ‌లేదు. వీరి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని హైకోర్టు చెప్పినా కూడా జ‌గ‌న్ వినిపించుకోలేదు. ఇక చేసేది లేక రాజ‌ధాని రైతులు కోవిడ్ కాలంలోనూ వ్యాధి తీవ్ర‌త హెచ్చుమీరుతున్న సంద‌ర్భంలోనూ వాన‌కూ ఎండ‌కూ వెర‌వ‌క త‌మ పోరు సాగించారు.



ఇదే స‌మ‌యంలో వీళ్ల‌ను టార్గెట్ చేస్తూ సాక్షి మీడియా కూడా కొన్ని క‌థ‌నాలు అల్లింది. ఎడిటోరియ‌ల్ కూడా అలానే వ‌చ్చేలా ప్లాన్ చేశారు. కొన్ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాల్లో మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న‌ను హైలెట్ చేస్తూ జ‌గ‌న్ చెప్పించిన మాట‌లూ రైతుల్లో ఆందోళ‌న‌లు రేగేలా చేశాయి. ఇంత జరిగినా జ‌గ‌న్ దిగిరాలేదు. అదృష్ట‌మో దుర‌దృష్ట‌మో వీరే ఇప్పుడు ఊరు ఊరు తిరుగుతూ త‌మ గోడు చెప్పుకుంటూ ప్ర‌జా మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. ఇంత‌కాలంభూములు సాగు చేసుకోలేక అటు ప్ర‌భుత్వం చెబుతున్న‌దేదీ అర్థం కాక న్యాయం అంటూ కోర్టులు చుట్టూ తిర‌గ‌డ‌మే వీరికి మిగిలింది. అయిన‌ప్ప‌టికీ వీరిని వైసీపీ కార్పొరేట్ రైతులు అని వ్య‌వ‌హ‌రిస్తూ ఉద్య‌మాన్ని కించ‌ప‌రుస్తూ రైతుల‌ను పెయిడ్ ఆర్టిస్టులు అని ఎద్దేవా చేస్తూ సాక్షి మీడియా ద్వారా జ‌గ‌న్ మ‌రింతగా తాను చెప్ప‌గ‌ల‌ను అనుకున్న మాట‌ల‌ను మ‌రింత లోతుగా చెబుతూ త‌న పంతం సాధించే క్ర‌మంలో ఉన్నారు. తాజాగా మూడు రాజ‌ధానుల బిల్లు రద్దు కావ‌డం, అమ‌రావ‌తిపై జ‌గ‌న్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని అనుకోవ‌డం అన్నీ జ‌రిగాయి కానీ ఇవేవీ స్థిరం కానీ ప‌రిణామాలే !

మరింత సమాచారం తెలుసుకోండి: