రాయలసీమకు కరవు సీమ అని పేరు. ఏ ఏడాది కూడా వర్షాలు సరిగ్గా పడవు. వర్షాభావంతో ఎపుడూ అల్లల్లాడతాయి. అలాంటి సీమ ఇపుడు అతలాకుతలం అవుతోంది. నాడు కరవు, నేడు కన్నీరు. మరి సీమ దుస్థితిని వర్ణించడానికి ఎవరికీ మాటలు రావడంలేదు.

కనీ వినీ ఎరగని జల ప్రళయం సీమను తాకింది. నాలుగు జిల్లాలూ చిగురుటాకులైపోయాయి. ప్రాణ నష్టంతో పాటు భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. అలాంటి సీమను ఆదుకునేందుకు కేంద్రం ఏం చేసింది అన్న ప్రశ్న ఉదయిస్తోంది. సీమకు తక్షణ సాయం ప్రకటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

నిజానికి సీమ ఎంతలా నష్టపోయింది అంటే జవాబు చెప్పేవారు లేరు. ఆ వివరాలు, చిట్టాపద్దులూ కూడా ఎవరికీ అందుబాటులో లేవు. నష్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి అలాంటి సీమకు తగిన సాయం చేయడానికి కేంద్రం ముందుకు రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు.  సీమ విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతున్నారు.

అక్కడ రోడ్లు లేవు, వంతెనలు లేవు, అన్నీ కొట్టుకుపోయాయి. బయట ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా కట్ అయిపోయాయి. అలాంటి సీమను ఆదుకుంటామని కేంద్రం అయితే చెప్పింది. ప్రధాని మోడీ ఏపీ సీఎం జగన్ కి ఫోన్ చేశారు. వివరాలు తెలుసుకున్నారు. అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పారు. మరి ఇపుడు ఆ సాయం అవసరం,  నష్టం ఎంత అన్నది తరువాత నివేదికలు చెబుతాయి కానీ ఇపుడు కళ్లకు కనిపిస్తున్న విళయాన్ని చూసి అయినా తగిన విధంగా సాయం చేయలన్న డిమాండ్ అయితే ఉంది. ఏపీ బీజేపీ నాయకులూ దీని మీద కేంద్రాన్ని కోరాలి. అలాగే ఏపీ సర్కార్ కూడా కేంద్రానికి విన్నపాలు చేయాలి అంటున్నారు. ఇంతటి పెను విప్పత్తుని చరిత్రలో చూసినది లేదు అని కూడా అంటున్నారు. మరి అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి అంతా రావాలని కూడా అన్ని వర్గాల వారిని జనాలు కోరుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: