ఏపీలో చంద్రబాబు పాలన‌కు జగన్ పాలనకు తేడా ఏంటి అంటే నాడు హడావుడి ఎక్కువగా ఉండేది, నేడు అది కనిపించడంలేదు అని ఎవరైనా చెప్పేస్తారు. అయితే హడావుడి అన్నిటా అనడం కాదు కానీ అవసరం అయిన మేరకు అయినా వైసీపీ పెద్దలు జనాల్లోకి రావాలి అన్నదైతే ఉంది.

ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పూర్తిగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కే పరిమితం అయ్యారని విమర్శలు ఉన్నాయి. దానికి కారణాలు కూడా ఉన్నాయి. జగన్ రెండేళ్ళుగా కరోనా ఎఫెక్ట్ తో కంప్లీట్ గా ఆఫీస్ ని అక్కడ నుంచే రన్ చేస్తున్నారు. కానీ ఇపుడు కరోనా తగ్గింది. ఇక తాజాగా రాయలసీమ జిల్లాలు చూస్తే జల ఖడ్గం వేటుకు విలవిలలాడుతున్నాయి.

అక్కడ జనాల జీవితం పూర్తిగా అంధకారం అయింది. జగన్ వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అయితే అది పూర్తిగా గాలిలో జరిగింది. అప్పటికి వరద  నీరు బాగా నిలిచి ఉందని కాబోలు ముఖ్యమంత్రి జనాల్లోకి రాలేదు. ఇపుడు కొంత ఉధృతి తగ్గింది కాబట్టి జగన్ రావాలి బాధితులను పరామర్శించాలి అని అంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.  ఆయన మూడు రోజుల పాటు సీమ జిల్లాల్లో టూర్ చేస్తున్నారు.

దాంతో బాధితులకు ప్రభుత్వం తరఫున కూడా ఓదార్పు అవసరం ఉంది. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు అంతా కలసి పనిచేస్తారు. కానీ తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ మాదిరిగా జగన్ కూడా వరద ప్రాంతాలను స్వయంగా చూస్తే ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది అంటున్నారు. ఇక విపక్షాలు ఇప్పటికే జగన్ మీద కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ నేత లోకేష్ అయితే గాలిలో తిరిగి జగన్ వెళ్ళిపోయారు అంటున్నరు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ జగన్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సీఎం అని అంటున్నారు. మరి జగన్ రావాలని వరద బాధిత  సీమ వాసులు కూడా కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: