ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కొన్ని విషయాల్లో పట్టుదలగా ముందుకు వెళ్ళినా సరే కొన్ని అంశాలకు సంబంధించి కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా పార్టీని సమర్థవంతంగా నడిపించిన జగన్ ప్రభుత్వంలో ముందుకు వెళ్లే విషయంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది అంశం. కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మంత్రులు అలాగే కొంతమంది సీనియర్ నాయకుల నుంచి సహకారం లేదని కొంతమంది సలహాదారులు కూడా విఫలం అవుతున్నారు అని ఆరోపణలు వినబడుతున్నాయి.

కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేయకు పోయినా సరే తర్వాత న్యాయ సమీక్ష లో ఇబ్బంది పడుతుంది. దీనికి ప్రధాన కారణం కొంతమంది మంత్రులు సమర్థవంతమైన సలహాలు ఇవ్వడం లేదని పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కూడా జగన్ కు సహకారం అందించడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీని కొన్ని కొన్ని అంశాలలో జగన్ చాలా వరకు సమర్థవంతంగా ముందుకు నడిపించి కొంతమంది నాయకులకు కీలక పదవులు అప్పగించారు. జగన్ చరిష్మా తో ముందుకు వచ్చిన చాలామంది నాయకులు ఇప్పుడు పార్టీలో గానీ ప్రభుత్వం గానీ జగన్ కు ఎటువంటి సలహాలు ఇవ్వలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి.

చాలామంది కీలక నాయకులు వ్యక్తిగత వ్యవహారాలు అలాగే వ్యక్తిగత వ్యాపారాలు మీద దృష్టి పెట్టడం అలాగే సొంత నియోజకవర్గంలో వర్గ విభేదాలను ప్రోత్సహించడం అలాగే కొంతమంది సీనియర్ నాయకులతో విభేదాలు పెట్టుకోవడం ద్వారా సమయం వృధా చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ కూడా పట్టు పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళడం వంటివి ఈ మధ్యకాలంలో హైలెట్ అవుతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: