ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించే విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎంతవరకు కష్టపడతారు అనేది ఇప్పుడు చాలా మంది లో ఉన్న ప్రశ్న. అమరావతి ఉద్యమానికి సంబంధించి బిజెపి కేంద్ర నాయకత్వం చెప్పిన తర్వాత సోము వీర్రాజు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి పాల్గొనే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కొన్ని కొన్ని కీలక అంశాల్లో సోము వీర్రాజు సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు అని ఆందోళన కొంతమంది రాష్ట్ర నాయకులలో వ్యక్తమవుతోంది. సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం అలాగే కొంతమంది నాయకులు ఆయన సూచనలను అమలు చేయకపోవడం వంటివి కూడా ఇబ్బంది పెడుతున్నాయి.

పార్టీలో ఉన్న చాలామంది నాయకులు సోము వీర్రాజు లెక్క చేయడం లేదని ఏ జిల్లాకు ఆ జిల్లాలో పార్టీలో వర్గాలు ఎక్కువగా ఉన్నాయని దీంతో చాలామంది నాయకులు సోము వీర్రాజు నీ లెక్క చేయడం లేదని అంటున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో సోము వీర్రాజు మాట వినే వాళ్ళ కంటే కూడా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట వినే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని అదే విధంగా కొంతమంది కీలక నాయకులు కూడా తెలుగుదేశం సహా కొన్ని పక్షాలతో ఎక్కువగా స్నేహం చేస్తున్నారని బిజెపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీలో ఉన్న నాయకులను ఏకతాటి మీదకు తీసుకొచ్చే విషయంలో గానీ అలాగే ప్రజా ఉద్యమాలు నిర్వహించే విషయంలో గానీ సోము వీర్రాజు సరిగా వ్యవహరించలేదు. ఇక పార్టీలో తన మాట వినని వాళ్ళు మరో ఆలోచన లేకుండా సస్పెండ్ చేయడం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడం  ఆంధ్రప్రదేశ్ బీజేపీ వెనక్కు తగ్గుతుందనేది అంశాలు. సోము వీర్రాజు ఇదే తరహాలో ముందుకు వెళితే మాత్రం పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఇతర పార్టీల వైపు చూడవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: