ఏపీలో రాజధాని రగడ ఇంకా నడుస్తూనే ఉంది....చంద్రబాబు అధికారంలోకి వచ్చి...రాష్ట్రం మధ్యలో ఉంటుందని అమరావతిని రాజధానిగా చేస్తే....జగన్ అధికారంలోకి వచ్చి...మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని చెప్పి మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చారు. ఇక రెండేళ్ల పాటు మూడు రాజధానుల అంశంపై రాజకీయం నడుస్తూనే ఉంది. అలాగే అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని ఆ ప్రాంత ప్రజలు, రైతులు రెండేళ్ళుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు.

కానీ రెండేళ్లుగా మూడు రాజధానులు ముందుకెళ్లలేదు...అమరావతి విషయంలో ఒక అడుగు ముందుకేయలేదు.  ఇదే క్రమంలో తాజాగా జగన్ ప్రభుత్వం...మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంది. త్వరలోనే మరో బిల్లుతో ముందుకొస్తామని చెప్పింది. అంటే ఇప్పటికీ ఏపీ రాజధాని విషయంలో గందరగోళం కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఏపీకి రాజధాని ఏది అనేది ఇప్పటిలో క్లారిటీ వచ్చేలా లేదు.

పైగా నెక్స్ట్ కూడా కొన్ని లోపాలని సరిచేసుకుని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులనే తీసుకొస్తుందని కొందరు ఊహిస్తున్నారు. లేదు లేదు ఈ సారి ఒక రాజధాని బిల్లుతో ముందుకొస్తారని, అది కూడా విశాఖపట్నంని రాజధాని చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరి జగన్ ప్రభుత్వం ఎలాంటి బిల్లుతో ముందుకొస్తుందనే విషయం ఎవరికీ క్లారిటీ లేదు. పైగా మూడు రాజధానులు తీసుకొస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో వైసీపీకి తిరుగుండదని ప్రచారం వస్తుంది.

కానీ ఈ విషయం పూర్తిగా కరెక్ట్ కాదనే చెప్పాలి. రాజధానులు పెట్టినా సరే ప్రజలకు మిగతా అంశాలు కూడా నచ్చాలి...ప్రభుత్వం వల్ల మనకు ఏం వస్తుందనేది కూడా జనాలు చూసుకుంటారు. ఆందుకే అమరావతిని తీసుకొచ్చిన చంద్రబాబుని ఆ ప్రాంత ప్రజలే ఓడించారు. అమరావతి ప్రాంతంలో టీడీపీ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.

కాబట్టి రాజధాని అంశం ఒకటే ప్రామాణికం కాదని చెప్పాలి. ప్రజలు అన్నీ అంశాలని పరిగణలోకి తీసుకునే ఓటు వేస్తారు. పైగా ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్తితి మరీ ఆశాజనకంగా లేదు అక్కడ కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. కాబట్టి రాజధాని తీసుకొస్తే ఉత్తరంధ్ర అంతా వైసీపీ వైపు ఉంటుందనేది భ్రమ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: