కృష్ణా జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నూజివీడు కూడా ఒకటి. మామూలుగా నూజివీడు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది...అది 2009 ఎన్నికల వరకే..ఇక్కడ టీడీపీ నాలుగుసార్లు గెలిచింది. కానీ 2014 ఎన్నికల నుంచి నూజివీడు వైసీపీ అడ్డాగా మారిపోయింది. అందులోనూ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అడ్డాగా ఉంది. 2004 ఎన్నికల్లో ఈయనే కాంగ్రెస్ తరుపున నూజివీడు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక 2014, 2019 ఎన్నికల్లో టీడీపీకి ఛాన్స్ ఇవ్వకుండా ఈయనే వైసీపీ తరుపున వరుసగా గెలిచారు. ఇలా వరుసగా గెలుస్తూ వస్తున్న ప్రతాప్...2024 ఎన్నికల్లో కూడా సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ నూజివీడులో టీడీపీ బలపడలేదు. అక్కడ ప్రతాప్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. ఇక్కడ టీడీపీ తరుపున ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు.

మూడోసారి కూడా ఈయనే టీడీపీ తరుపున బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈయనకు కొందరు టీడీపీ నేతల నుంచి సరైన సహకారం అందడం లేదు. నూజివీడులో ఉన్న కొందరు కమ్మ నేతలు...ముద్దరబోయినని సైడ్ చేయాలని చూస్తున్నారు. అసలు ఆయనకు టిక్కెట్ దక్కకుండా చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అదే ట్రై చేశారు గానీ కుదరలేదు. ఈ సారి ఖచ్చితంగా సీటు రాకుండా చేయాలని చూస్తున్నారు. ఇలా ముద్దరబోయినకు సొంత పార్టీలోనే యాంటీ ఉండటం బాగా మైనస్ అవుతుంది.

అటు ప్రతాప్ ఏమో దూసుకెళుతున్నారు...వైసీపీకి బాగా ప్లస్ లేకపోయినా సరే, టీడీపీకి ఉన్న మైనస్సే....వైసీపీకి ప్లస్ అవుతుంది. అయితే ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉంది...ఈలోపు టీడీపీలో ఏమన్నా మార్పులు వచ్చి పికప్ అయితే బాగానే ఉంటుంది....లేకపోతే మళ్ళీ ప్రతాప్ గెలవడం ఈజీ అవుతుంది. అధిష్టానం కూడా నూజివీడుపై స్పెషల్ ఫోకస్ చేసి టీడీపీలో ఉన్న గ్రూపులకు చెక్ పెట్టాలి అప్పుడే...పార్టీకి ప్లస్...లేకపోతే ప్రతాప్‌కు ప్లస్.

మరింత సమాచారం తెలుసుకోండి: