ఏపీ రాజకీయాల్లో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం అనూహ్యంగా కొన్ని ట్విస్ట్‌లు ఇస్తుంది. ఇప్పటికే మూడు రాజధానుల అంశంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తీసుకుంది. సడన్‌గా మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుని ట్విస్ట్ ఇచ్చింది. అలాగే మండలి రద్దు బిల్లుని కూడా ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో మంత్రివర్గంలో కూడా మార్పులు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఎలాగో రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ డిసెంబర్‌కు జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అవుతుంది. దీంతో మంత్రివర్గంలో కూడా మార్పులు చేయడానికి కూడా జగన్ రెడీ అయిపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావాహులు జగన్ మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్న విషయం తెలిసిందే.

అయితే కాపు కోటాలో మంత్రులుగా అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జగన్ క్యాబినెట్‌లో కాపు కోటాలో నలుగురు మంత్రులు ఉన్నారు. పేర్ని నాని, ఆళ్ళ నాని, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌లు ఉన్నారు. ఇక తూర్పు కాపు కోటాలో బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నారు. ఆయన్ని మార్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఇక ఈ నలుగురులో మార్పులు తప్పవని తెలుస్తోంది. దీంతో వీరి స్థానంలో అవకాశం కోసం అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను, గ్రంథి శ్రీనివాస్, దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా....ఇంకా కొందరు కాపు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో అవకాశం ఎదురుచూస్తున్నారు. మరి వీరిలో జగన్ ఎవరికి అవకాశం ఇస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. కాకపోతే సామినేనికి పదవి మాత్రం గ్యారెంటీ అని ప్రచారం జరుగుతుంది. మరి సీఎం జగన్, ఆయనకు ఖచ్చితంగా పదవి వస్తుందేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: