ఇండియా.. చైనా.. ఇరుగు పొరుగు దేశాలు.. హిమాలయాలకు ఇవతల ఒక దేశం.. హిమాలయాలకు అవతల మరో దేశం.. దాదాపు రెండు దేశాలు ఒకే సమయంలో స్వంతంత్ర్య దేశాలుగా ప్రస్థానం ప్రారంభించాయి.. కానీ ఇప్పుడు చూస్తే.. చైనా ఇండియాను దాటేసి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ దేశం ఇప్పుడు అమెరికాకు సైతం చుక్కలు చూపిస్తోంది. ప్రపంచ నెంబర్ వన్‌ గా నిలిచేందుకు తాపత్రయ పడుతోంది. అతి తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా కనిపిస్తోంది.


ఇప్పుడు ప్రపంచంలో చైనా లేకపోతే.. చాలా దేశాల్లో ఫ్యాక్టరీలు కూడా నడవవు. అంతగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు చైనా మూల కేంద్రంగా మారింది. ఒక్కోసారి ఇవన్నీ చూస్తే.. చైనా కంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామా అన్న నిరాశ కనిపిస్తోంది. చైనా రేంజ్‌కు మనం ఎప్పుడు చేరుకుంటామా అన్న ఆందోళన కలుగుతోంది. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.. ఆర్థికంగా ఇండియా చైనా కంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చు. పరిశ్రమల పరంగా.. ఇతర సౌకర్యాల పరంగా చైనా ఇండియా కంటే చాలా ఎక్కువ స్థాయిలోనే ఉండొచ్చు. కానీ.. కొన్ని కీలక విషయాల్లో మాత్రం ఇండియా చాలా బెటర్ అని చెప్పాలి.


ఆ విషయాలు ఏంటంటే.. ప్రజాస్వామ్యం.. అవును.. మనది ప్రజాస్వామ్య దేశం.. ఇక్కడ బహుళ పార్టీ వ్యవస్థ ఉంది. ఏ పార్టీని జనం గెలిపిస్తే.. ఆ పార్టీదే అధికారం. కానీ చైనా అలా కాదు.. చైనాలో ఉన్నది ఒకటే పార్టీ అది కమ్యూనిస్టు పార్టీ.. మరి అక్కడ ఎన్నికలు ఉండవా అంటే.. ఉంటాయి.. కానీ.. ఒకే పార్టీలో ఎన్నికలు.. అంటే అక్కడ కమ్యూనిస్టు పార్టీకి ఎదురులేదు.. అలాంటప్పడు ఇక ప్రజాస్వామ్యానికి తావు ఉండే అవకాశమే లేదు. అంతే కాదు.. పార్టీ వ్యతిరేకంగా, ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ల పని అంతే.


ఇప్పటికే చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారన్న కారణంతో అనేక మంది ప్రముఖులు ఇప్పటికే గల్లంతయ్యారు. జాక్ మా వంటి వారి సంగతి చూస్తూనే ఉన్నాం.. మరి ఎంత తక్కువ అభివృద్ధి ఉన్నా.. ఇండియాలో మాత్రం ఇలాంటి దారుణాలు తక్కువే. అందుకే అనిపిస్తోంటుంది.. దీనమ్మ చైనా కంటే మనం చాలా బెటర్ గురూ అని.

మరింత సమాచారం తెలుసుకోండి: