మన దేశంలో ఎంత కాదనుకున్నా కులం, మతం ప్రభావం నుంచి రాజకీయాలను వేరు చేసి చూడలేం.. ఆ ప్రభావం లేకుండా మనదేశంలో రాజకీయమూ సాగడం లేదు. అందుకే ఇటీవలి కాలంలో సోషల్ ఇంజినీరింగ్ అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. అంటే.. సమాజంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలను కలుపుకుపోయేలా చేసే కూర్పు అన్నమాట. అంటే రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని ప్రభావం ఆయా కులాలు, మతాలపై ఎలా ఉంటుందో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం.. అలాగే.. అని కులాలు, వర్గాలకు సమ ప్రాధాన్యం ఉండేలా చూసుకోవడం అని చెప్పుకోవచ్చు.


ఈ సోషల్ ఇంజినీరింగ్ కాన్సెప్టు అమలు చేయడంలో వైసీపీ ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే.. వైసీపీ తరఫున మొత్తంగా గెలిచిన, గెలచబోతున్న ఎమ్మెల్సీల సంఖ్య 32 వరకూ ఉంటే.. వీటిలో 18 పదవులు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. అలాగే రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలు ఉన్నారు. అలాగే శాసన మండలి చైర్మన్‌ పదవిని జగన్ తొలిసారి దళితులకు కట్టబెట్టారు. అలాగే శాశ్వత బీసీ కమిషన్‌ను కూడా నియమించారు.


అక్కడితో ఆగకుండా నామినేటెడ్‌ పదవులు, పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ,బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మళ్లీ అందులోనూ 50 శాతం పదవులు మహిళలకు కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ సోషల్ ఇంజినీరింగ్ అమలు చేస్తోంది. మొత్తం 648 మండలాల్లో బీసీలకు అక్షరాల 239 అధ్యక్ష పదవులు ఇచ్చింది. అలాగే 13 జిల్లా పరిషత్‌ చైర్మన్ల పదవుల్లో బీసీలకు 6 పదవులు ఇచ్చారు. 46 శాతం బీసీలకు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 69 శాతం పదవులు ఇచ్చింది వైసీపీ.


13 నగర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల్లో బీసీలకు 7 పదవులు అంటే 54శాతం ఇచ్చింది వైసీపీ. అలాగే  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం పదవులు ఇచ్చింది. 87 మున్సిపాలిటీల్లో బీసీలకు 37 చైర్మన్‌ పదవులు అంటే 44శాతం.. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 73 శాతం పదవులు ఇచ్చింది వైసీపీ. అలాగే ప్రభుత్వ కార్పొరేషన్లలోని 137 చైర్మన్‌ పదవుల్లో బీసీలకు 39శాతం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 58 శాతం పదవులు కట్టబెట్టింది వైసీపీ. ఇదీ వైసీపీ సోషల్ ఇంజినీరింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: