భారీ వర్షాలు దక్షిణ భారతదేశాన్ని కుదిపేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలతో అటు తూర్పు కోస్తా ప్రాంతం నుంచి ఇటు కేరళ రాష్ట్రం వరకు భారీ వర్షాలు కురుస్తున్నారు. దాదాపు 15 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే తమిళనాడు, కేరళ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే వందల ఎకరాల్లో పంట నీటి పాలైంది. వందల మంది నిరాశ్రయులయ్యారు. ఆంధ్రప్రదేశ్‍‌లో ఇప్పటికే 30 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అటు కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంబా నదికి వరద నీరు పొటెత్తడంతో... గత శనివారం, ఆదివారాల్లో అయ్యప్ప దర్శనాన్ని నిలిపివేశారు ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు. ఇక తమిళనాడు రాష్ట్రం అయితే చిగురుటాకులా వణుకుతోంది. తుపాన్లు, భారీ వర్షాలతో చెన్నై నగరం సహా రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ నష్టం జరిగింది.

తమిళనాడు రాష్ట్రంలో గత పది రోజులుగా కురిసిన వర్షాలకు ఏకంగా 60 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 70 శాతం పైగా పంట భారీ వర్షాలకు నీటి పాలైనట్లు కేంద్రానికి పంపిన నివేదికలో తమిళనాడు అధికారులు వెల్లడించారు. చెన్నై, విల్లుపురం, కడలూరు, కన్యాకుమారి, ట్యూటికొరన్ సహా దక్షిణ డెల్టా ప్రాంతాలపై వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తగా దాదాపు 2 వేల 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా కోతకు వచ్చిన పంట కూడా నీటిలో నానిపోయిందని... దీని కారణంగా వేల మంది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయినట్లు కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు కూడా నీటితో నిండిపోయి ఉన్నాయని... ఈ పరిస్థితుల్లో మరోసారి వర్షం వస్తే... దిగువ ప్రాంతాల ప్రజలు మరింత ఇబ్బందులు పడతారని కేంద్ర బృందానికి తెలిపారు. నాలుగు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందానికి తమిళనాడు అధికారులు పూర్తి స్థాయి నివేదిక సమర్పించారు. ఏకంగా 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని... తక్షణమే కేంద్రం సాయం చేయాలని తమిళనాడు అధికారులు కేంద్రానికి లేఖ రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: