గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న  సంగతి మనందరికీ విధితమే. అతి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు మరియు శ్రీ వారి సన్నిధి అయిన చిత్తూరు జిల్లాలో... భారీ నుంచి అతి భారీ వర్షాలు కొడుతున్నాయి. దీంతో రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. వరుణుడు సృష్టించే బీభత్సానికి అనేక కష్టాలు పడుతున్నారు రాయలసీమ.. ఇక భారీ వర్షాలకు తిరుమల సన్నిధిలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి మనందరికీ విధితమే. ఏనాడు లేని పరిస్థితులు... ప్రస్తుతం తిరుమల ప్రాంతంలో ఉండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల ఘాట్ రోడ్డు అలాగే నడక మార్గాలు పూర్తిగా విధ్వంసానికి గురయ్యాయి. బ్రహ్మంగారు చెప్పిన విధంగానే భారీ వర్షాలకు తిరుమల మార్గాలు మూసివేయబడ్డాయి. ఇక కర్నూలు జిల్లా మరియు కడప జిల్లాలో చాలా మంది వరదలకు గల్లంతయ్యారు. కొన్ని కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అలాగే పంట పొలాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో రాయలసీమ రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పినప్పటికీ ఆ రైతులకు భరోసాను కలిగించడం లేదు. రాయలసీమ నేపథ్యం ఉన్న సినిమాలు కొన్ని వందలు వచ్చాయి. అందులో అగ్ర హీరో సినిమా నుంచి చిన్న హీరో సినిమాల వరకు ఎన్నో ఉన్నాయి... యాస ను వాడుకుని మంచి డైలాగులు కొట్టారు.  కానీ ఇప్పుడు రాయలసీమకు కష్టం వస్తె ఒక్కడు అంటే ఒక్కడు కూడా ముందుకు రాలేదు. సినిమా విడుదలకు ముందు తర్వాత తిరుమల వెళ్లే వాళ్ళు ఇప్పుడు అదే తిరుమల లో పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న ముందుకు రావట్లేదు.  సినిమా విడుదలకు జనాలను వాడుకునే స్టార్ లు ఈ రోజు ఏముపోయారు...? ఇతర భాషల్లో ప్రజలకు కష్టం వస్తె హీరోలు ముందు ఉంటారు. కానీ హైదరాబాద్ వరదలు వచ్చినా ఎక్కడ వచ్చినా సరే వీళ్ళు మాత్రం ప్రేక్షకులే. అయితే ఇలాంటి తరుణంలో రాజకీయ నేపథ్యం ఉన్న నందమూరి హీరోలు  అయినా.. రాయలసీమ ప్రజలకు న్యాయం చేస్తారా ? అనే అందరిలోనూ ఓ సందేహం నెలకొంది. బాలయ్య అక్కడి ఎమ్యెల్యే కాబట్టి కచ్చితంగా తన వంతు సహాయం చేయాల్సిందే. అలాగే ఎన్టీఆర్ కూడా వారి సహాయం చేయాలని ఆశిద్దాం. వెంటనే సీమ కోసం నందమూరి హీరోలు తొడ కొట్టాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: