ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి. దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా ఆయ‌న రాజ‌కీయాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కుమారుడిని కూడా రాజ‌కీయా ల్లోకి తీసుకువ‌చ్చారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు తండ్రి మాట‌ను విన్న కుమారుడు వెంక‌టేష్‌.. ఇప్పుడు వ్యూ హాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేటాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు తండ్రీ కొడుకుల మ‌ధ్య ఆలోచ‌న‌లో తేడాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. లేదు డాడీ.. మ‌నం ఇలా చేద్దాం! అని కొడుకు వెంక‌టేష్ అంటున్నార‌ట‌.

అయితే..దీనికి కౌంటర్‌గా.. కాదు, నీకు తెలీదు.. ఇలా చేద్దాం..! అని క‌ర‌ణం చెబుతున్నార‌ట‌. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఒక‌ర‌కంగా.. రాజ‌కీయ సైలెంట్ వార్ న‌డుస్తోంద‌ని.. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ఆది నుంచి కూడా కొన్ని రోజులు కాంగ్రెస్‌లో ఉన్నా.. త‌ర్వాత‌.. టీడీపీ నాయ‌కుడిగానే క‌ర‌ణం.. ద‌శాబ్దాల పాటు చ‌క్రంతిప్పారు. ఈ క్ర‌మంలోనే ఒంగోలు ఎంపీగా, అద్దంకి ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో చీరాల నుంచి ఆయ‌న టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. టీడీపీ ప‌రాజ‌యం త‌ర్వాత‌.. అధికార వైసీపీలోకి వ‌చ్చారు.

ఇక్క‌డ ఆయ‌న ఉన్న‌ప్ప‌టికీ.. స్థానికంగా నేత‌లు ఆయ‌న‌తో క‌లివిడిగా ఉండ‌డంలేదు. దీనికి కార‌ణం.. టీడీపీ నుంచి భౌతికంగా బ‌య‌ట‌కు వ‌చ్చినా.. మాన‌సికంగా.. క‌ర‌ణం ఆ పార్టీలోనే ఉన్నార‌ని అంటున్నా రు. ఇప్ప‌టికీ టీడీపీ మాజీ మంత్రులు, అధికారుల‌తో ట‌చ్‌లో ఉన్నార‌న్న టాక్ ఉంది. ఎందుకంటే. రేపు ఒక‌వేళ‌.. వైసీపీ బ‌ల‌హీన‌ప‌డితే.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తే.. టీడీపీలో పీఠం క‌దిలిపోకుండా చూసుకుంటున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కాక‌పోతే.. రేపైనా.. బ‌ల‌రాం మ‌ళ్లీ టీడీపీలో కి వెళ్లాల‌ని చూస్తున్నారు. అందుకే వ‌ల్ల‌భ‌నేని వంశీతో పాటు పార్టీ మారిన మ‌ద్దాలి గిరి లాంటి వాళ్లు టీడీపీని, చంద్ర‌బాబును విమ‌ర్శించిన‌ట్టు బ‌ల‌రాం ఎక్క‌డా విమ‌ర్శించ‌డం లేదు.

అస‌లు చంద్ర‌బాబును, లోకేష్‌ను, టీడీపీని విమ‌ర్శించే సాహ‌సం కూడా ఆయ‌న చేయ‌డం లేదు. దీనికి మ‌రోకార‌ణం కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ చీరాల టికెట్ క‌ర‌ణంకు ఇచ్చే ఛాన్స్ లేద‌ని అంటున్నారు. దీంతో క‌రణం తిరిగి త‌న పాత గూటికి వెళ్లేందుకు చూస్తున్నారన్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. ఆయ‌న కుమారుడు వెంక‌టేష్‌ వ్యూహం మ‌రోలా ఉంది. క‌ర‌ణం సొంత నియోజ‌క‌వ‌ర్గం అద్దంకిలో వైసీపీ విజ‌యం కోసం ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఇక్క‌డి గొట్టిపాటి ర‌వి.. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ల‌డం.. ఆ పార్టీలోనూ విజ‌యం సాధించ‌డం.. త‌ర్వాత‌.. వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నించినా.. ఆయ‌న రాక‌పోవ‌డం.. వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఓడించి తీరాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఈ నేప‌థ్యంలో  గొట్టిపాటి ర‌విని ఓడించాలంటే..  వెంక‌టేష్ వ‌ల్లే సాధ్యం అవుతుంద‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నార ట‌. ఇదే విష‌యాన్ని యువ నేత‌గా ఉన్న వెంక‌టేష్‌కు ఉప్పందించారు. దీంతో ఆయ‌న వైసీపీలోనే ఉందామని చెబుతున్నారు. కానీ, క‌ర‌ణం మాత్రం ఈ విష‌యంలో డైల‌మాలోనే ఉన్నార‌ని అంటున్నారు. దీంతో ఇప్పుడు తండ్రీ కుమారుల మ‌ధ్య ఇది వివాదంగా మారింద‌ని.. జిల్లాలో పెద్ద చ‌ర్చ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.  ఏదేమైనా క‌ర‌ణం రాజ‌కీయాన్ని మాత్రం వైసీపీ వాళ్లు న‌మ్మ‌లేని ప‌రిస్థితే ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: