ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ తారాస్దాయికి చేరింది.రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఏదీ తేల్చుకోలేక పోతున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు టీడీపీ ఒక సంక్లిష్ట‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. చంద్ర‌బాబుకు ప‌డిపోయిన ఇమేజ్‌ను తిరిగి నిల‌బెట్టాల‌నిపార్టీ వ్యూహ‌క‌ర్త‌లు నిర్ణ‌యించారు. ఎందుకంటే.. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనే టీడీపీ ప‌రువు పోయింది. ఇటీవ‌ల స్థానిక స‌మ‌రంలో క‌నీసం పోటీని కూడా ఇవ్వ‌లేక పోయింది. నిజానికి ఇక్క‌డ ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉంటే.. క‌నీసం పోటీ అయినా ఇచ్చి ఉండేది. కేవ‌లం 5 వార్డుల కే టీడీపీ ప‌రిమిత‌మైంది.

ఈ నేప‌థ్యంలో పార్టీని బ‌తికించుకునేందుకు సానుభూతిని మించిన మార్గం మ‌రొక‌టి లేద‌ని.. నాయ‌కులు నిర్ణ‌యించుకున్నారు. అయి తే.. ఇప్పుడు దీనికి ఇటీవ‌ల శుక్ర‌వారం అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న వారికి ఆలంబ‌న‌గా మారింది. చంద్ర‌బాబుకుటుంబాన్ని సైతం రాజ‌కీయా ల్లో లాగారంటూ.. టీడీపీ నాయకులు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదేస‌మ‌యంలో చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకున్న సీన్ ను మ‌రింత‌గా రిపీట్ చేయాల‌ని భావించారు.

అయితే..ఇంత‌వ‌ర‌కు వారి వ్యూహం బాగున్నా.. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో.. మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. వైసీపీ నిర్ణ‌యించుకుంది. దీంతో మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకిస్తున్న టీడీపీ.. దీనికి వ్య‌తిరేకంగా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి. మూడు రాజ‌ధానులు కాద‌ని.. అమ‌రావ‌తి మాత్ర‌మే రావాల‌ని.. టీడీపీ కోరుకుంటున్న విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లకు వివ‌రించాలి. దీనికి సానుభూతిని కూడా పొందాలి.

ఈ క్ర‌మంలో అటు చంద్ర‌బాబుకు జ‌రిగిన అవ‌మానాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలా?  లేక‌.. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ను ఒప్పించాలా?  లేక ఏక‌కాలంలో ఈ రెండు విష‌యాల‌పైనా.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకోవాలా?  అనేది.. ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. దీనిపైనే టీడీపీ సీనియ‌ర్లు జోరుగా చ‌ర్చించుకుంటున్నారు. మొత్ఆనికి ఈ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: