ఏపీ లోని కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం లోని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈరోజు తీవ్ర ఉత్కంఠ మధ్య జరగనుంది. ఇప్పటికే ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే నిన్న మున్సిపల్ కార్యాలయం బయట వైసీపీ కార్యకర్తలు చేసిన హడావుడి తో రిటర్నింగ్ అధికారి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు. అయితే టిడిపి హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు రిటర్నింగ్ అధికారి తోపాటు విజయవాడ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు తప్పనిసరిగా  మునిసిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక నిర్వహించాలని తీర్పు ఇచ్చింది.

ఇప్ప‌టికే టీడీపీ, వైసీపీలు కౌన్సిలర్లతో క్యాంపులను నిర్వహిస్తుం డ‌డంతో అస‌లు చైర్మ‌న్  ఏ పార్టీ ప‌రం అవుతుందా ? అన్న ఉత్కంఠ అయితే త‌ప్ప‌డం లేదు. ఇక ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టి నుంచి న‌డిపిస‌త్ఓన్న క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి  కౌన్సెల‌ర్ల‌ను తరలించే ఏర్పాట్లు ఇరు పార్టీలు చేసుకున్నాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లు తమ పార్టీ కౌన్సిలర్లను దగ్గరుండి మ‌రీ మునిసిప‌ల్ కార్యాల‌యానికి తీసుకు వ‌చ్చారు.

ఎందుకంటే రెండు పార్టీల మ‌ధ్య నెక్ టు నెక్ ఫైట్ న‌డుస్తోంది. ఇలాంటి టైంలో ఒక్క ఓటు తారు మారు అయినా చైర్మ‌న్ ప‌ద‌వి ఇత‌ర పార్టీల‌కు వెళ్లి పోతుంది. అధికార వైసీపీకి ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి 15, టీడీపీకి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి పదహారు ఓట్లున్నాయి. అయితే చివరి నిమిషంలో ఏదైనా జరుగుతుందేమోనన్న టెన్షన్ లో అయితే టీడీపీ వాళ్ల లో ఎక్కువుగా క‌నిపిస్తోంది.

ఇక టీడీపీ కౌన్సెల‌ర్ల ను మునిసిప‌ల్ ఆఫీస్‌కు తీసుకు వ‌చ్చే ముందు ఎంపీ కేశినేని నానిపార్టీ కౌన్సెల‌ర్ల కు కౌన్సెలింగ్ ఇవ్వ‌డంతో పాటు ఎలాంటి పొర‌పాట్లు చేయ‌వ‌ద్ద‌ని కౌన్సెల‌ర్ల‌కు క్లాస్ పీకారు. ఎవ‌రు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుక‌న్నా కూడా చివరి నిమిషంలో సీన్ మారుతుందేమోనన్న ఉత్కంఠ కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో నెలకొందని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇప్పుడు అక్క‌డ అంతా ఒక్క‌టే ఉత్కంఠ‌గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: