తిరుపతి... ప్రముఖ పుణ్యక్షేత్రం సరే.  ఈ నగరానికి ఓ ప్రత్యేకతుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో.. సీడెడ్ జిల్లాలకు  తిరుపతి ప్రధాన పంపిణీ కేంద్రం.  రాయల సీమ జిల్లాలను టాలీవుడ్  లో సీడెడ్ గా వ్యవహరిస్తారు. సినీరంగ ప్రముఖులందరికీ తిరుపతి నగరంలో  పంపిణీ సంస్థలున్నాయి. ఇక్కడి వారు  ఎక్కవ మంది టాలీవుడ్ లో నిర్మాతలుగా ఉన్నారు.
ఇటీవలి వరుస తుఫాన్ లతో రాయల సీమ జిల్లాలు, ముఖ్యంగా తిరుపతి, కడప నగరాలు అతలాకుతలం  అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.  వరుదల మూలంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారి లెక్క ఇంకా తేలలేదు. ఇక మూగజీవాల పరిస్థితి సరేసరి.వాటి బాధ పడే రైతులు తప్పితే.  ఇంకెవరూ మూగజీవాల ఆక్రందన వినేవారే లేరు.
సినీ రంగంలో రాయలసీమ వాసులు ఎక్కవ మంది నిర్మతలున్నారు.  రాయలసీమ  నేపథ్యంలో తీసిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ లో బాక్సాఫీసులో రికార్డులు బద్దాలు కొట్టాయి కూడా. కానీ ఇటీవలి వర్షాలకు  సినీ రంగ ప్రముఖలు ఎవ్వరూ గడపదాటి వెలుపలికి రాలేదు.
తిరుపరి ఆర్డీసి బస్టాండ్ కు, రైల్వే స్టేషన్ కు కూత వేటు దూరంలో నే  టాలీవుడ్ పంపిణీ సంస్థల కార్యాలయాలున్నాయి.   అన్నీ కూడా పెదకాపు లేఅవుట్, చిన్నకాపు లేఅవుట్, డిఆర్ మహల్ సెంటర్ తదితర ప్రాంతాలలోనే ఉన్నాయి. ఈ సంస్థల ప్రతినిధులు కానీ, యజమానులు కానీ ఎవ్వరూ వరద బాధితులకు  సాయం చేసిన పాపాన పోలేదు. ఇక తిరుపతి నగరంలో గ్రూప్ థియేటర్స్  అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. ఇది తిరిపతి మాజీ ఎం.ఎల్.ఏ చదలవాడ కృష్ణమూర్తికి చెందినవి ఆయనకు వీటితో పాటు పలు విద్యా సంస్థలు తిరుపతి కేంద్రంగా ఉన్నాయి. గతంలో వదాన్యుడు గా పేరు తెచ్చుకున్న చదలవాడ ఈ దఫా వర్షాల సమయంలో  గడపదాటి రాలేదు.  ఆయన నివాసం ఉన్న ప్రాంతం లో కూడా రెండు రోజుల పాటు వరద నీరు నిలిచి ఉంది. అయినా కూడా  అతని తాలూకు వ్యక్తు లెవరూ గడపదాటి రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదల వాడ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు గా కూడా సేవలందించారు. ఆయన శ్రీమతి  సుచరిత కు కూడా టాలీవుడ్ తో పరోక్ష సంబంధాలున్నాయి. ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తారని అప్పుడప్పుడూ వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. ఆవిడ కూడా  సేవా కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. చదల వాడ బావ మరిది ఎన్. వి. ప్రసాద్ టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత ఇష్క్, గాడ్ ఫాధర్ తదితరాలు  ఆయన తాజా చిత్రాలు. ఎన్. వి. ప్రసాద్ నివాసం కూడా తిరుపతే. ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, కనీసం అనుచర గణం కానీ ఎవ్వరూ వరద బాధితులకు సాయం  చేసేందుకు ముందుకు రాకపోవడం స్థానికులను బాధిస్తోంది. వీరే కాదు ఎందరెందరో నాటి నుంచి నేటి వరకూ సీడెడ్ లోని ప్రముఖులు టాలీపుడ్ లో తమదైన పాత్ర పోషించారు. ప్రస్తుతం మాత్రం గడపదాటి రావడం లేదు. కారణం ఆ వేంకటేశ్వరుడికే ఎరుక.


మరింత సమాచారం తెలుసుకోండి: