విశాఖపట్నం రాజధానిగా జగన్ ఆడుగులు వేస్తున్నారా,అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన ప్రకటన వెనుక ఉన్న ఆంతర్యం అదేనా.అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అవ్వడానికి లక్షలు కోట్ల అవసరం అని సీఎం జగన్ పదే పదే ప్రస్తావించడం వెనుక ఉద్దేశ్యం ఏంటి,క్రమ పద్దతి ప్రకారం విశాఖపట్నం పూర్తి స్థాయి రాజధానిగా చేసేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారా.


కారణాలు ఏవైనా అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మూడు రాజధానముల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు శాసనసభ వేదికగా  ప్రకటించారు.కానీ రాజధాని విషయంలో కన్ఫ్యూజన్ కు మాత్రం తేరదించలేదు,పైగా సభలో బిల్లును రద్దు చేస్తూనే విశాఖపట్నం రాజధాని అయితే బాగుంటుందని ప్రస్తావన తెచ్చారు,వనరుల పరంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో అన్ని వసతులు ఉన్నాయని చెప్పుకొచ్చ్చారు,అయితే ఇప్పుడు రాష్ట్రం;లో నెలకొన్న పరిణామాల దృష్ట్యా ప్రభుత్వం సైలెంట్ గా ఉన్నా త్వరలోనే విశాఖపట్నం వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది,ఇప్పటికిప్పుడు బిల్లును వెనక్కు తీసుకోని త్వరలోనే న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని చర్యలు తీసుకోని విశాఖ వేదికగా పూర్తి స్థాయి  రాజధాని ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.పైగా రెండేళ్లుగా మూడు రాజధానుల  విషయంలో నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు విశాఖను పూర్తి స్థాయి రాజధానిని చేసేందుకు చర్యలు ప్రారంభించింది.


మరోవైపు రాజధాని విషయంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కోవడం  మాట మర్చి అప్రతిష్ట పాలయ్యామని చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఇకపై అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టంగా బిల్లును సిద్ధం చేసిన ఒకే రాజధాని అది కూడా విశాఖలోనే అని త్వరలోనే చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది.ఇప్పటికే అయితే రాజధానిగా బాగుంటుందని రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్తూనే విశాఖపట్నంకు అమరావతికి ముడి పెట్టారు సీఎం.అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేని అమరావతి సకల వసతులు ఉన్న విశాఖపట్నంకు తేడా చూపుతూ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లీని నగరంగా విశాఖపట్నం ఉందని రాజధాని విశాఖ అంటూనే చెప్పకనే చెప్పారు సీఎం పైగా,మూడు రెండు అంటూ కన్ఫ్యూజన్ లేకుండా విశాఖపట్నం  అభివృద్ధి చేస్తే త్వరలోనే రాజధానిగా విశాఖపట్నం అవుతుందని అధికారులకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.అందులో భాగంగా వికేంద్రీకరణ మంత్రాన్ని జపిస్తూనే రాయలసీమ,కోస్తాంధ్ర,ఉత్తరాంద్రలో ఎటువంటి వ్యతిరేకత లేకుండా సీఎం అడుగులు వేస్తునారన్న చర్చ నడుస్తోంది.మూడు రాజధానుల నిర్ణయంతోనే  ఇన్ని విమర్సలను ఎదుర్కున్న సీఎం త్వరలోనే  విశాఖను పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: