ఇప్పుడంతా వాన‌లు
ఇప్పుడంతా వ‌ర‌ద‌లు
అయినా కూడా
ఇవేవీ ప‌ట్ట‌వు
ప‌ట్టించుకున్నవారే అరుదు
మ‌న టికెట్టు మ‌న ఇష్టం
మ‌న సినిమా మన ఇష్టం క‌దా
అలానే అనుకుంటే ఇంత‌మంది హీరోలు
యాడ నుంచి దిగివ‌చ్చార‌ని?
ఆప‌ద అంటే అంద‌రినీ ఆదుకోవాల‌ని కాదు కానీ
కొంత‌లో కొంత సామాజిక బాధ్య‌త పాటిస్తే మేలు
ఆ ప‌ని నానీ చేస్తాడో చేయ‌డో అన్న‌ది ఇప్పుడిక ఓ సందేహం!సినిమా ఎలా ఉన్నా ఓ పాట సీమ‌కు సంబంధించిన పాట‌త పెద్ హిట్ కొట్టింది. చాట్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఆ పాట కు మూలంగా నిలిచిన సీమ ప‌ల్లె వ‌రుస వాన‌ల‌తో వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌లం అయిపోయి  ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతోంది. ఒక‌ప్పుడు ఫ్యాక్ష‌న్ ప‌డ‌గ నీడ‌లో ఇప్పుడు ప్ర‌కృతి ప‌డ‌గ నీడ‌లో బిక్కు బిక్కుమ‌ని కాలం గ‌డుపుతోంది. ఈ ద‌శ‌లో నానీ లాంటి పెద్ద మ‌న‌సున్న చిన్న హీరోలు త‌మ‌కు తోచినంతంగా విరాళాలు ప్ర‌క‌టించి తమ ప‌రిధిలో సీమ ప‌ల్లెల‌కు అండ‌గా ఉంటే మేలు.

దారీ చూడు దుమ్మూ చూడు అన్న పాట గుర్తిందిగా! చిత్తూరు పెద్దాయ‌న పెంచ‌ల‌దాసు రాసుకుని పాడిన పాట. కృష్ణార్జున యుద్ధం సినిమా కోసం.. ఆ త‌రువాత కూడా ఆయ‌న మంచి పాట‌లే రాశారు అది వేరే విష‌యం. అయితే సిమ పాట‌ను వాడుకున్న నానీ కి పాపం సీమ క‌ష్టాలే ప‌ట్ట‌డం లేదు. ఆయ‌న స్థాయి హీరోలు ఓ న‌లుగురు క‌లిస్తే కొన్ని కుటుంబాల‌కు అయినా భ‌రోసా ద‌క్కుతుంది. చేయూత అందుతుంది. కానీ నానీ అందుకు సిద్ధంగా ఉన్నాడో లేదో! అస‌లీయ‌న‌కు సీమ క‌ష్టాలు ఇక్క‌డి క‌రువు నేల‌లు, ఇప్పుడున్న వ‌ర‌ద‌లు ఇవ‌న్నీ తెలుసో లేదో! ఏదేమ‌యిన‌ప్ప‌టికీ చిన్న స్థాయి నుంచి వ‌చ్చిన నానీ చిన్న వారిని క‌లుపుకుని త‌న‌వంతు సాయం అందిస్తే సీమ అత‌ని కృషినో దాతృత్వాన్నో మ‌రిచిపోదు.

ఇంకా చెప్పాలంటే....
చిన్న సినిమాల‌కు పెద్ద హీరో నానీ. చేసినవి కొద్ది సినిమాలే అయినా మంచి క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. మేర్ల‌పాక ముర‌ళి, ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ, శివ నిర్వాణ, గౌత‌మ్ తిన్న‌నూరి వంటి ప్ర‌తిభావంతుల‌యిన ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసి ఇండ‌స్ట్రీకో బెస్ట్ ఔట్ పుట్ అందించాడు. అదేవిధంగా మినిమ‌మ్ గ్యారెంటీ ఉన్న క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నాక కొన్ని ఫంక్ష‌న్ల‌లో యాటిట్యూడ్ చూపించ‌డం, కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం వంటి చేశాడు. అయినా కూడా ఆయ‌న క్రేజ్ కు ఢోకాలేదు. సినిమా హిట్టా ఫ‌ట్టా అన్న ప‌ట్టింపు లేకుండా వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీబిజీగానే గ‌డిపేస్తున్నాడు. పేరుకు చిన్న‌హీరో అయినా రెండ‌క్ష‌రాల ఆ పేరులో మంచి ఎంత చెడు ఎంత స్పందించే గుణం ఎంత అన్న‌దిక చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: