ఏపీ సీఎం జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో బీసీ ల ఓటు బ్యాంకులో చాలా వ‌ర‌కు చీలిక తెచ్చారు. అందుకే టీడీపీ చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది. బీసీలు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. బీసీల్లో కొన్ని బ‌ల‌మైన కులాలు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ కి వ‌న్ సైడ్ గా ఓట్లేయ‌డంతో జ‌గ‌న్ ఊహించ‌ని విధంగా ఆ పార్టీకి ఏకంగా 151 సీట్లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీసీ ఓట్ల‌ను పూర్తి గా టీడీపీకి దూరం చేసేలా జ‌గ‌న్ వ్యూహం ప‌న్నుతున్నారు. జ‌గ‌న్ త్వ‌ర‌లోనే బీసీ ల జ‌నాభా గ‌ణ‌న‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మొద‌లు పెట్టే జ‌న‌గ‌ణ‌న ఫార‌మ్ లో బీసీల కేట‌గిరి అనే కాల‌మ్ ను కూడా ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

మిగిలిన దేశం సంగ‌తి ప‌క్క‌న పెట్టేస్తే రాష్ట్రం లో వ‌ర‌కు బీసీ ల ఓట్ల పైనే టీడీపీ, వైసీపీ ప్ర‌ధానంగా కాన్‌సంట్రేష‌న్ చేస్తూ వ‌చ్చాయి. తెలుగు దేశం ఏర్పాటు అయిన ద‌గ్గ‌ర నుంచి కూడా గంప గుత్త‌గా సైకిల్ గుర్తుకే వేస్తూ ఆ పార్టీని ఎన్నో సార్లు అధికారంలోకి తీసుకు వ‌చ్చారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బీసీ ల ఓట్ల‌లో చీలిక తేవ‌డంతో చ‌రిత్ర‌లోనే లేనంత ఘోరంగా టీడీపీ కేవ‌లం 23 సీట్ల తో స‌రి పెట్టుకుంది. అయితే ఇప్పుడు టీడీపీ లో బీసీలు అన్న మాట లేకుండా చేయాల‌నే జ‌గ‌న్ కంక‌ణం క‌ట్టుకున్నారు.

అందుకే ఎమ్మెల్సీ లు, ఇత ర నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో జ‌గ‌న్ బీసీల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. పైగా ఎన్నో బీసీ కార్పోరేష‌న్లు ఏర్పాటు చేశారు. దేశ చ‌రిత్ర‌లోనే ఏ ముఖ్య‌మంత్రి ఏర్పాటు చేయ‌లేన‌ట్టుగా జ‌గ‌న్ బీసీ కార్పోరేష‌న్లు ఏర్పాటు చేశారు. జిల్లా పరిష‌త్ ప‌ద‌వులు, ఎంపీపీ , జ‌డ్పీటీసీ ప‌ద‌వుల్లో కూడా జ‌న‌ర‌ల్ స్థానాల్లోనూ వారికే ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఇక రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టేసి జ‌గ‌న్ మ‌రీ బీసీ జ‌పం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ బీసీ జ‌నాభా గ‌ణ‌న చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. బీసీల జ‌నాభాపై ఖ‌చ్చిత‌మైన లెక్క‌లు ఉండాల‌ని జ‌గ‌న్ కోరుకుంటున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి మేర‌కు బీసీల జ‌నాభా లెక్కించ డానికి కేంద్రం ఓకే చెపితే జ‌గ‌న్ ప్ర‌య‌త్నం మ‌రింత స‌క్సెస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: