ప్రస్తుతం దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థగా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు ఎంతో నాణ్యమైన సర్వీసు అందించడంలో ముందు ఉంటుంది. టెక్నాలజీకి అనుగుణంగా సర్వీసులను ఎప్పటికప్పుడు మార్పులు తీసుకు వస్తూనే ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఇటీవలి కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా పెంచిన ఛార్జీలు అటు ఖాతాదారుల అందరికీ కూడా భారంగానే మారిపోయాయి అని చెప్పాలి. ఏకంగా నాలుగు సార్లు కంటే ఎక్కువగా ఏటీఎం ట్రాన్సాక్షన్ లు చేస్తే ఇంకొక ట్రాన్సాక్షన్ కి ఏకంగా 17.70 రూపాయలను వసూలు చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.


 కానీ ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  వినియోగదారులందరికీ శుభవార్త చెప్పింది. స్టేట్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉపయోగిస్తున్న కస్టమర్లు అందరూ కూడా స్టేట్ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో ఎంతో లబ్ధి పొందనున్నారు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ డిజిటల్ రూపంలో చెల్లించి లావాదేవీల కోసం ఇక నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోము అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఒక ప్రకటనలో తెలిపటం గమనార్హం. అయితే భారతదేశపు అతిపెద్ద రుణ సంస్థ గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017 నుంచి 2020 వరకు కూడా జన్ ధన్  ఖాతాదారుల నుంచి 164  కోట్ల వరకు కూడా మినహాయింపు ఇచ్చింది అన్న విషయం కూడా ఇటీవల వెల్లడైంది..


 ఇందులో భాగంగా యూపీఐ, రూపే కార్డు ద్వారా లావాదేవీల కోసం కేవలం 90 కోట్లు రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కొక్క బ్యాంకు ఖాతా నుంచి 17.70 రూపాయలు వసూలు చేసింది. ఈ క్రమంలోనే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, రూపే డెబిట్ కార్డులను ఉపయోగించి లావాదేవీలు సహా డిజిటల్ లావాదేవీలను జరిపే వారు ఇక నుండి ఎలాంటిఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇది ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ కస్టమర్లు అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: