ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే అంశాన్ని భారతీయ జనతా పార్టీ సమర్ధవంతంగా వాడుకునే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గాని బిజెపి రాష్ట్ర నాయకులు గానీ కొన్ని కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో టార్గెట్ చేసి విమర్శించడం మొదలుపెట్టారు. తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని చూసుకుని భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే అమరావతి ఉద్యమం విషయంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం బిజెపి కీలక నాయకులు అందరు కూడా ఉద్యమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం వంటివి కాస్త రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కి కలిసివచ్చే అంశాలు గా చెప్పుకోవాలి. అయితే సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వంపై అమరావతి ఉద్యమం విషయంలో ఒత్తిడి తెచ్చారని ప్రజాభీష్టం మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కాస్త రాష్ట్ర నాయకత్వానికి సూచనలు సలహాలు ఇచ్చింది అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇక ముఖ్యమంత్రి వైయస్ జగన్ తమకు భయపడి అమరావతి ఉద్యమం విషయంలో వెనక్కు తగ్గే అవకాశంలేదు అని ఇన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ఆందళోనలు చేస్తున్న పట్టించుకోలేదు అని మేము మద్దతు ఇవ్వడం తో వైసీపీ  అమరావతి విషయంలో వెనక్కు తగ్గింది అని బిజెపి ప్రచారం చేసుకుంటుంది. ఏది ఎలా ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ నాయకులు అమరావతి ఉద్యమం విషయంలో ప్రతి అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం క్రెడిట్ అంతా కూడా తాము తీసుకునే ప్రయత్నం చేయడం మాత్రం కాస్త విడ్డూరంగా మారిన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp