ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సినిమా పరిశ్రమ అనుసరిస్తున్న వైఖరి అలాగే ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తున్న వివక్ష విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వినపడుతున్నాయి. సినిమా పరిశ్రమలో అన్ని విధాలుగా కూడా కొంతమంది ఆంధ్రప్రదేశ్ ను వాడుకోవడమే గాని రాష్ట్రానికి సహాయం చేసే విషయంలో ముందుకు రావడం లేదు అని ఆందోళన చాలా వరకు కూడా వ్యక్తమవుతోంది. కొంతమంది సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు అవసరమైతే రాష్ట్రానికి రావడం లేకపోతే మాత్రం హైదరాబాద్లో ఉండి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు సహాయం చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకరు ఇద్దరు హీరోలు తప్ప మిగతా వారు  మన ఆంధ్రప్రదేశ్ కి పెద్దగా సహాయం చేసే పరిస్థితి లేకపోవడం పట్ల కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయంగా తమకు ఏదైనా అవసరం ఉంటే రాష్ట్రంలో అడుగుపెట్టడం లేకపోతే మాత్రం కనీస రాష్ట్రానికి రాకపోవడాన్ని చాలామంది విభేదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో వరదలు అలాగే ఆర్థిక కష్టాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం పట్ల అభిప్రాయాలు మారుతున్నాయి. కొంతమంది యువ హీరోలు ఆంధ్రప్రదేశ్ కి తన సినిమా ప్రమోషన్ కోసం వస్తున్నారు కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంటే రావడం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చిన్న కార్యక్రమం మొదలు పెట్టినా సరే దానికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే తెలుగు సినిమా హీరోయిన్ ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంటే మాత్రం కనీస రూపాయి కూడా సహాయం చేయడానికి ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలతో వరదల నానా ఇబ్బందులు పెట్టాయి అనే మాట వాస్తవం. అయినా సరే చాలామంది టాలీవుడ్ హీరోలు ముందుకు రాకపోవడం కనీసం సోషల్ మీడియాలో కూడా సంతాపం వ్యక్తం చేయకపోవడం అనేది విమర్శలకు దారితీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap ts