2014 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో సినిమా పరిశ్రమ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో అభిమానుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమా పరిశ్రమలో ఉన్న కొంతమంది పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలదూర్చడం లేకపోతే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వంటివి మాత్రమే జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్న సమయంలో కనీసం పత్రికా ప్రకటనలు విడుదల చేయడం కానీ లేక పోతే కొంత విరాళం ప్రకటించడం గానీ ఎప్పుడూ కూడా జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో కొంతమంది వివక్ష చూపిస్తున్నారనే భావన కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది.

సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాదు లోనే ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి రాని నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే భయం లేదని కొంతమంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు కూడా సినిమా పరిశ్రమ విషయంలో పెద్దగా సానుకూలంగా లేరని గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా పరిశ్రమకు అనేక రాయితీలు ప్రకటించిన సరే చాలా వరకు సినిమా పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని అర్థం అయింది.

ఇక ముఖ్యమంత్రి గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు ఆంధ్రప్రదేశ్ రావటమే కాని కొన్ని కొన్ని కీలక అంశాలకు సంబంధించి కనీసం ముఖ్యమంత్రి తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం అనేది విమర్శలకు దారితీస్తోంది. హైదరాబాద్ లో వరదలు వచ్చిన సమయంలో కొంతమంది సహాయం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ను సంప్రదించడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్న సమయంలో రాయలసీమ ప్రాంతంలో వరదలు వస్తున్న సమయంలో కనీసం ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడే ప్రయత్నం గానీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో ఒక సహాయం చేసే ప్రయత్నం చేయకపోవడం మాత్రం వివాదాస్పదమవుతున్న అంశంగా చెప్పాలి.మరి దీని   పై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: