ఆంధ్రప్రదేశ్ ప్రజలను సినిమా పరిశ్రమ మాటలతో మోసం చేస్తుంది అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి సినీ పరిశ్రమ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆందోళన ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మాట్లాడటం తమ సినిమాలకు సంబంధించి టికెట్ ధరలు భారీగా పెంచడానికి జగన్ తో చర్చలు జరగడం వంటివి కాస్త ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్న సమయంలో మాత్రం చాలా మంది సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కనీసం ఆంధ్రప్రదేశ్ రాకపోవడం వంటిది ఒకటే అయితే... తమ సినిమాలు విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో కొన్ని ప్రాంతాలను పొగిడే ప్రయత్నం చేయడం కొన్ని వర్గాలను దగ్గర చేసుకునే విధంగా మాయ మాటలు చెప్పడం అనేది సినిమా పరిశ్రమకు అలవాటైపోయింది. తమ సినిమాల వసూళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తున్నారని కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

తమ సినిమాల ప్రమోషన్ కోసం అభిమానులను అన్ని విధాలుగా వాడుకుంటున్నారు గాని ఇప్పుడు అదే అభిమానులు నానా కష్టాలు పడుతున్నారు సరే కనీసం వచ్చి పరామర్శించే ప్రయత్నం కూడా చేయడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో అక్కడి హీరోలు ప్రజలకు కష్టాలు వస్తే ముందు వరుసలో ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అటువంటి పరిస్థితులు లేకపోవడం అనేది ఈ మధ్య కాలంలో కాస్త ఇబ్బందికరంగా మారిన అంశంగా చెప్పాలి. కాబట్టి ప్రజలు టాలీవుడ్ సినిమాలను బహిష్కరిస్తే మంచిదని అనవసరంగా వారి మాటల్లో పడి డబ్బులు వృధా చేసుకోవద్దని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని హీరోలు ఏ విధంగా హీరోలు అవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap