ఏపీలో పొత్తుల అంశంపై అప్పుడే పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ఎలాగో ఒంటరిగానే బరిలో దిగడం ఖాయం. కానీ టీడీపీ ఒంటరిగా బరిలో దిగితే మాత్రం..వైసీపీకి చెక్ పెట్టడం చాలా కష్టమనే చెప్పొచ్చు. పైగా జనసేన విడిగా పోటీ చేస్తే ...టీడీపీకే పెద్ద నష్టం...అలాగే వైసీపీకి లాభం. గత ఎన్నికల్లో అదే జరిగింది..జనసేన ఓట్లు చీల్చి..టీడీపీకి నష్టం చేసింది.

అయితే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన ఒంటరిగా బరిలో దిగితే టీడీపీకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అలాగే టీడీపీ విజయావకాశాలని దెబ్బతీసినట్లు అవుతుంది. జనసేన ఎలాగో గెలవదు...టీడీపీని గెలవనివ్వదు అన్నట్లు పరిస్తితి మారుతుంది. అందుకే జనసేనని కలుపుకుని ముందుకెళ్లాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.  అదేవిధంగా పవన్ కల్యాణ్ సైతం చంద్రబాబుతో జట్టు కట్టడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో ఒంటరిగా బరిలో దిగితే ఒకటి, రెండు సీట్లు గెలవడమే కష్టమైపోతుంది. అందుకే టీడీపీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు...అలాగే అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కీలకంగా ఉండొచ్చు. అందుకే పవన్ సైతం, టీడీపీతో దోస్తీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే జనసేనతో పొత్తు విషయంలో టీడీపీ నేతలకు కూడా క్లారిటీ వచ్చినట్లే కనబడుతోంది. ఎందుకంటే కొన్నిచోట్ల జనసేన కోసం టీడీపీ నేతలు సీట్లు త్యాగం చేయాలి. ఇదే క్రమంలో రెండు పార్టీల పొత్తు ఉంటే...విశాఖపట్నం ఎంపీ సీటు జనసేనకే దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. అక్కడ టీడీపీ తరుపున బాలయ్య చిన్నల్లుడు భరత్ పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతోనే ఓడిపోయారు.
ఈ సారి కూడా ఆయన అక్కడే పోటీ చేయనున్నారు. పొత్తుపై కూడా ఆయనకు క్లారిటీ ఉందని తెలుస్తోంది. అందుకే అప్పుడు పరిస్తితులని బట్టి రాజకీయం ఉంటుందని భరత్ చెబుతున్నారు. ఒకవేళ పొత్తు ఉన్నా సరే భరత్‌కు ఇబ్బంది ఉండదనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: