రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కలెక్టర్ ముఖ్యమంత్రి కాళ్లు బహిరంగంగా మొక్కడం ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే కాదు చట్టరీత్యా నేరమని ఐఏఎస్ అధికారులు, విజ్ఞులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.
రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తించడం, రాజకీయ లబ్దికోసం ఆరాటపడడం దీని వెనుక ఉన్నట్లు అధినాయకత్వంతో ఆత్మీయ సాంగత్యాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా  ప్రయోజనం పొందాలన్నదే కాళ్ళు మొక్కడం వెనుక ఉన్న అసలు రహస్యం అని ప్రచారం జరుగుతున్నది. ఏది ఏమైతేనేమి రాజీనామా చేసి వెనువెంటనే ఏకగ్రీవంగా కౌన్సిల్ సభ్యులు  కావడం సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి ఉల్లంఘించడమేనని బహుజన నాయకులు ఖండిస్తున్నారు.

  కాళ్లు మొక్కింది  అందుకేనా..?

వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం". శ్రీశ్రీ గారు వ్యాఖ్యానించిన హెచ్చరిక    మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి అక్షరాల వర్తిస్తుంది. సిద్దిపేట  జిల్లా కలెక్టర్ గా కొనసాగుతూ అనేకసార్లు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి, ప్రజల రాజకీయ పక్షాల ఆగ్రహానికి గురై ఏకంగా ఎమ్మెల్సీ కావడం ఏమిటని అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నారు . రైతులు వరి పంట వేయకూడదని, వరి విత్తనాలను డీలర్లు దుకాణాదారులు అమ్మితే  శిక్షిస్తామని, కోర్టులు చెప్పినా కూడా వినే ప్రసక్తే లేదని  న్యాయ వ్యవస్థను కూడా కించపరిచిన మాజీ కలెక్టర్  ఏరకంగా ఎమ్మెల్సీకి అర్హుడో ? టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. కోకాపేట భూముల అమ్మకం లో తమ బంధువులకు చెందిన కంపెనీ పరంగా భూములను తక్కువ ధరకు పొందాడు అన్న విమర్శ ఉండనే ఉన్నది. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి తో సన్నిహితంగా ఉండడం వెనుక అవినీతి ఆరోపణలను ప్రతిపక్షాలు చేసిన హెచ్చరికలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మంటల్లో కాలిన శ్రీకాంతాచారిని మరిచారా..!
 తెలంగాణ ఉద్యమంలో నిర్విరామంగా కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు, మన పాలన మనకు బావుంటుందని ఆశించిన ఎంతో మంది విద్యార్థుల బలిదానం అయ్యారు. దీనిలో భాగంగా శ్రీకాంతాచారి బహిరంగంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తెలిసేలా చేసిన వ్యక్తి. ఆయన మరణంతో ఢిల్లీ కరుణించింది. కానీ ఆయన కుటుంబాన్ని తెరాస ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించలేదు. కాళ్లు మొక్కిన కలెక్టర్కు పదవి ఇచ్చారు కానీ, శ్రీకాంతాచారి కుటుంబానికి ఏ పదవి ఇచ్చారు గుర్తుచేసుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: