సమాజంలో 6 శాతం గా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి టిఆర్ఎస్ పార్టీ పరంగా 8 మంది రెడ్డి కార్యకర్తలకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్ చేయడం 52 శాతం ఉన్న బీసీ వర్గాలకు కూడా 8 మందినే నామినేట్ చేయడం పట్ల సామాజిక న్యాయాన్ని ధిక్కరించిన ప్రభుత్వ పాలసీని దళిత బహుజన మేధావులు ఖండిస్తున్నారు. వెంకట్రామి రెడ్డికి ఉన్న అర్హతలు ఏమిటి..?  రాజీనామా చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందలేదు కదా..! అలాంటప్పుడు నామినేషన్ వేయడం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇవాళ  హైకోర్టులో వివాదాస్పదంగా మారిన విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఐఏఎస్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తారు. కనుక కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం  చెల్లనేరదని రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం వెనుక ఆయన అనర్హతకు ఎన్నో కారణాలు ఉన్నట్టు గా ప్రతి పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ అభిప్రాయ పడుతున్నది.

    తెలంగాణ రాష్ట్ర సాధనకు దళిత బహుజనులు, సబ్బండ వర్గాలు చేసిన త్యాగాలకు బలిదానాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని, సామాజిక వర్గాలను పక్కనపెట్టి నామమాత్రంగా ఉన్న వర్గాలకు ఏనాడు తెలంగాణ కోసం పని చేయని వారికి కౌన్సిల్ లో సభ్యత్వం ఇవ్వడం ప్రజల దృష్టిలో ఇవ్వాళ వివాదాస్పదంగా మారింది. తెలంగాణ సెంటిమెంట్ తోనే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నది . కానీ తెలంగాణ ఆకాంక్షలు వీసమెత్తు కూడా అమలు కావడం లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సామాజికన్యాయం అంతో ఇంతో అనుభవించామని ప్రజా గాయకుడు  ఏపూరి సోమన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయo 100% వాస్తవం    కాదా..?      అర్హతలు త్యాగాలు లేనటువంటి వారికి అవకాశం ఇవ్వడం, వివాదాస్పదులను నామినేట్ చేయడం, సామాజిక న్యాయాన్ని పాటించకపోవడం, రెడ్డి వెలమ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడం, దళిత బహుజనులు మైనార్టీలను జెండాలు మోసే వారిగానే అవమానించడాన్ని బట్టి ఆత్మగౌరవం కోసం మరొక్కమారు పోరాటం రావాల్సిన అవసరం ఉందని సోమన్న  ఇచ్చిన పిలుపును దళిత బహుజనులు, మైనార్టీలు, అట్టడుగు వర్గాలు ఆలోచించుకొని  ఉమ్మడి  పోరాట కార్యక్రమానికి సిద్ధ పడాల్సిన అవసరం ఉందని ప్రజలు గ్రహించాలి.
      కలెక్టర్ గా ఉన్నప్పుడు, రాజీనామా చేసిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శాసనసభ్యునిగా ఏ రకంగా  అర్హుడు న్యాయ స్థానం తేల్చనుంది. తెరాస పార్టీ ప్రభుత్వ పెద్దలు అంతకుముందే పునరాలోచన చేసుకొని చేసిన తప్పులను సవరించుకుoటే మంచిదని, సామాజిక న్యాయాన్ని ఇకముందు పాటించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని దళిత బహుజనులు మైనారిటీలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సంగతి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: