యాసంగి రైతుబంధు విడుదల దిశగా  కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కథనాలు నిధులపై ఆయన ఆర్థిక శాఖ నుండి వివరాలు తప్పించుకున్నారు. యాసంగి సీజన్ లో రైతాంగానికి పెట్టుబడి సాయంగా ఈ నిధులు ఉపయోగపడాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు లోకేంద్ర ఉదాసీనత కారణంగా నష్టపోయిన టువంటి రైతాంగాన్ని రైతుబంధు నిద్రతో సాంగ్ దిశగా సమాయత్తం చేయాలని ప్రభుత్వం సంకల్పం గా ఉంది. ఈ సీజన్లో కోటిన్నర లక్షల ఎకరాలకు  7,500 కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.  దీంతో ఈ నిధులు సర్దుబాటు సమీకరణాల పై సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల ఆఖరి లో లేదంటే వచ్చే నెల ఉద్యోగుల వేతనాలు చెల్లించడం వెంటనే రైతులకు రైతుబంధు నిధులను విడతలవారీగా ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత జూన్లో వానాకాలం పంట సాగుకు 60.84 లక్షల మంది రైతాంగానికి 7360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే యాసంగి సీజన్లో విస్తీర్ణం పెరగడంతో సాయం చేయాల్సిన నిధులు కూడా పెరగనున్నాయి. దీంతో సర్కారు నగదు కోసం సిద్ధం చేస్తోంది. మొదటిరోజు ఎకరం వరకు, రెండవ రోజు రెండు ఎకరాల రైతులకు, మూడవరోజు మూడు ఎకరాల రైతులకు ఇలా వరుసగా రైతుబంధు వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక శాఖ ఉన్న నిధులు వేతనాలు పింఛన్లు ఇతర ప్రజా సంక్షేమ పథకాలను చెల్లింపుల వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకానికి నిధుల సేకరణ దిశగా దృష్టి సారించింది. ఏది ఏమైనా అనుకున్న గడువులోపు రైతులకు అండగా నిలిచేందుకు రైతుబంధు సాయం అందించి తీరాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మరో కొత్త షరతు తీసుకువచ్చింది. వంద ఎకరాలకు పైగా ఉన్న రైతులకు చెక్కులు ఇచ్చేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి రైతుబంధు సాయం కూడా నిరాకరించింది. తెలంగాణలో మిగులు భూములు సీలింగ్ యాక్ట్ ల్యాండ్ చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి 54 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలని నిబంధన ఉంది . అంతకు మించితే అది సీలింగ్ ల్యాండ్ గా పరిగణిస్తారు. దీంతో వీరికి చెక్కులు పంపిణీ నిలిపి వేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: