కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేదు
పెద్ద గ‌ది పెద్ద తాళం క‌ప్ప త‌ప్ప
పెద్ద మ‌న‌సున్న నేత‌లు ఎవ్వ‌రూ
ఆ ఆఫీసులో లేరు
ఈ సంద‌ర్భంలో పీసీసీ బాస్ చేసేదేం లేదు
ఇక‌పై కూడా ఉండ‌దు

ఆ కుర్చీల‌లో లేరు క‌నుక కాంగ్రెస్ ఇక తెలంగాణ‌లో కోలుకోవ‌డం ఖాయం అని చెప్ప‌లేం. అంత‌గా అక్క‌డి రాజ‌కీయం విస్తృత స్థా యిలో కాక వికృత స్థాయిలో న‌డుస్తోంది. కాలం కల‌సిరాని నేత‌లంతా అక్క‌డ ప‌ద‌వుల పందేరంలో ఉన్నారు. ఎలానూ గాంధీ భ‌వ న్ గ‌బ్బిలాల‌కు ప‌నేలేదు. పార్టీ ప‌ద‌వి ఉంటే చాలు రాణించేద్దాం అనుకుంటున్న వారికి  రేవంత్ నుంచి సానుకూల సంకేతాలు అయితే రావ‌డం లేదు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఏమ‌యినా క్షేత్ర స్థాయిలో మార్పులు వ‌స్తాయ‌ని ఆశించినా అది కూడా జ‌ర‌గ‌లేదు. దీంతో ఇప్ప‌ట్లో చావు బ‌తుకుల మ‌ధ్య  కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కు కొన ఊపిరి ఊద‌డం, పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకురావ‌డం అన్న‌ది కుద‌ర‌ని ప‌ని అని తేలిపోయింది.

ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో..
తెలంగాణ‌లో విస్తృత స్థాయిలో రాజ‌కీయాలు చేద్దామ‌న్నా, ఎదిగి పేరు నిలుపుకుందామ‌న్నా ఇప్ప‌టికిప్పుడు సాధ్యం అయ్యేలా లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంపై ఎందుక‌నో పార్టీ న‌మ్మ‌కం ఉంచ‌డం లేదు. ఆయ‌న‌కూ, చంద్ర‌బాబుకూ ఉన్న రిలేష‌న్ కార‌ణంగా ఇక్కడెందుకో నిల‌దొక్కుకోలేక‌పోతున్నారు. పేరు రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేత అయినా సంబంధిత కుల స‌మీక‌ర‌ణలు కూడా ఆయ‌న‌కు క‌లిసిరావ‌డం లేదు. పీసీసీ బాస్ అయ్యాక తొలి రోజుల్లో మంచి ఫాంలో ఉన్నాన‌నే నిరూపించారు. ఎక్క‌డిక‌క్క‌డ స‌భ‌లూ, స‌మావేశాలూ నిర్వ‌హించి పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో మంచి జోష్ నింపారు కానీ ఇప్పుడు అలా లేదు. ముందున్న స్పీడు ఇప్పుడు ఆయ‌న లో లేదు. దీనికి తోడు ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాల మ‌ధ్య కాలం గ‌డ‌ప‌డమే త‌ప్ప పార్టీ బాగుకు కేసీఆర్ తో త‌ల‌ప‌డేందుకు పీసీసీ బాస్ శ్ర‌ద్ధ చూప‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: