ఏపీలో అధికార వైసీపీ లో మరో 11 మందికి కొత్త పదవులు దక్కనున్నాయి. ఇప్పటివరకు పార్టీ లో సాధారణ నేతలుగా ఉన్న వారంతా ఇప్పుడు చట్టసభల్లో కి వెళ్లనున్నారు. ఏపీ లోని 13 జిల్లాల్లో ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 11 స్థానాలు అధికార వైసీపీ ఖాతాలో ఏక‌గ్రీవం కానున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపికి ఈ 11 స్థానాల్లో కనీసం పోటీ చేసేందుకు కూడా బలం లేదు. దీంతో టిడిపి అసలు పోటీ చేయలేదు. దీంతో 11 ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవ‌డం లాంఛ‌నం అయిపోయింది.

ఇక కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు చూస్తే కృష్ణా జిల్లా నుంచి మొండితోక అరుణ్ కుమార్, తలసిల రఘురాం ఎమ్మెల్సీలుగా ఉంటారు. విశాఖ జిల్లా నుంచి ప్ర‌స్తుతం కార్పోరేట‌ర్ గా ఉన్న న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడు బొమ్మ‌న బోయిన వంశీ కృష్ణ శ్రీనివాస్ యాద‌వ్ తో పాటు మ‌హిళా నేత‌ వరుదు కల్యాణి ఎమ్మెల్సీలు. వీరిలో వ‌రుదు క‌ళ్యాణి స్వ‌స్థ‌లం శ్రీకాకుళం అయితే.. ఆమెకు విశాఖ స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక వంశీ స్వ‌స్థ‌లం కూడా ప్ర‌కాశం జిల్లాయే.

గుంటూరు జిల్లా నుంచి తాజా మాజీ ఎమ్మెల్సీ  ఉమ్మారెడ్డి  వెంకటేశ్వర్లు, మూరుగుడు హనుమంతరావు - విజయనగరం జిల్లా నుంచి ఎస్ కోట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌  ఇందుకురు రఘురాజు , తూర్పుగోదావరి జిల్లా నుంచి రంప‌చోడ‌వ‌రం పార్టీ నేత అనంత ఉదయ భాస్కర్ ( మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూకు మేన‌ళ్లుడు ), అనంతపురం జిల్లా నుంచి ఉర‌వ‌కొండ నేత , తాజా మాజీ ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి ఎమ్మెల్సీలు కానున్నారు.

ఇక చిత్తూరు జిల్లా నుంచి కుప్పం ఇన్ చార్జ్ భరత్, ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు మాజీ పార్టీ ఇన్ చార్జ్ అయిన తూమాటి మాధవరావు ఎమ్మెల్సీలు కానున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: