గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్ననట్లు ఘనంగా ప్రకటించిన జగన్ సర్కా‌ర్‌పై ఇప్పుడు అదే గ్రామ సర్పంచులు తిరుగు బావుటా ఎగుర వేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కూడా జగన్ పూర్తి చేశారు. రికార్డు స్థాయిలో 90 శాతం పైగా పంచాయతీలపై తమ పార్టీ జెండా ఎగిరేలా చూసుకున్నారు కూడా. గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తున్నామని ఘనంగా చెప్పుకుంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం... వాటిని నిధులు కేటాయించడంలో మాత్రం నిర్లక్ష్యంంగా వ్యవహరిస్తోంది. అసలే అంతంత మాత్రం నిధులున్న పంచాయతీలు... అభివృద్ధి పనుల విషయం పక్కన పెడితే... రోజు వారి ఖర్చులకు కూడా ప్రస్తుతం అల్లాడుతున్నాయి. పరిపాలన ఎలా చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం సర్పంచులది.

పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో... 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వాడేసుకుంది. వచ్చినంత సేపు కూడా పట్టలేదు డ్రా చేయటానికి. ఇప్పుడు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా వచ్చే సమయం దగ్గర పడింది. అయితే ఇప్పటికే ఆర్థిక లోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జగన్ సర్కార్... ఆ నిధులు కూడా వాడేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక  సిద్ధం చేసింది. ఇప్పటికే పంచాయతీలో పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు చేసిన సర్పంచులు... పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని ఇప్పటికే రోడ్డెక్కారు. తాజాగా కడప జిల్లాకు చెందిన 15 మంది సర్పంచులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ... వైసీపీకి రాజీనామా చేశారు. అటు సర్పంచులకు పోటీగా వీఆర్‌వోలను ప్రభుత్వం రంగంలోకి దింపడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కేటాయింపులో వివక్షత చూపడంతో పాటు... కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: