క‌రోనా వ్యాక్సిన్ అంద‌రికీ అందించేందుకు అధికారులు కృషి చేయాలి అని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి సూచించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భ‌త్వాల ప‌థ‌కాల అమ‌లు తీరుపై హైద‌రాబాద్‌లోని టూరిజం ప్లాజాలో అధికారులతో స‌మావేశం నిర్వ‌హించారు ఆయ‌న‌. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద 20 కోట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది అని తెలిపారు. రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల సహకారంతో బస్తీల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి సూచించారు. ఇతర దేశాలు భారత్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయని ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.



బస్తీ దావాఖానాలను సమర్ధవంతంగా నిర్వహించాలని, పథకాలు అమలు చేస్తున్నప్పుడు తలెత్తే సమస్యలను అధికారులు గుర్తించాలి అని తెలిపారు కిష‌న్ రెడ్డి . సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే పథకాల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది అని అన్నారు. స్వ‌నిది యోజన పథకం హైదరాబాద్ లో అధికారులు బాగా అమలు చేశారు అంటూ ప్ర‌శంసించారు. వీధి వ్యాపారులుగా గుర్తింపు కార్డు ఇవ్వడంలో ఆలస్యమవుతుంది.. దానిని అధిగమించాలి అని అధికారుల‌కు కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి సూచించారు. ఈ స‌మావేశంలో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌, దిశ క‌మిటీ స‌భ్యులు, ప‌లు శాఖ‌ల ఉన్న‌తాధికారులు, అధికారులు పాల్గొన్నారు.


 అయితే, స‌మావేశానికి క‌లెక్ట‌ర్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డుమ్మాకొట్టారు.  దీంతో వారిపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఇక మీ నిర్ల‌క్ష్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించేది లేద‌ని మండిప‌డ్డారు. గంట‌లో స‌మావేశానికి హ‌జ‌రు కాక‌పోతే తీవ్ర ప‌రిణామాలు చ‌విచూడాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. దీంతో ఈ విష‌యాన్ని అధికారులు ఫోన్ ద్వారా క‌లెక్ట‌ర్ కు, క‌మిష‌న‌ర్‌కు తెలియ‌జేడంతో హుటా హుటిన‌.. మీటింగ్‌కు హాజ‌ర‌య్యారు. అయితే, క‌లెక్ట‌ర్, జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై  కేంద్ర‌ మంత్రి కిష‌న్ రెడ్డి సీరియ‌స్ కావ‌డంతో అక్క‌డ ఉన్న అధికారులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: