ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు అటు కొన్ని జిల్లాలను ముంచెత్తాయి అన్న విషయం తెలిసిందే. వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. వరద ప్రభావం కారణంగా ఏకంగా జనావాసాలు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.  అందరికీ కూడా అండగా ఉంటానంటూ హామీ ఇస్తూ ధైర్యం చెబుతున్నారు. అదే సమయంలో ఇక జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.



 అయితే ఇటీవలే వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రజల దగ్గరికి వచ్చి అందరికీ ధైర్యం చెప్పకుండా ఏరియల్ సర్వే నిర్వహించిన జగన్ గాల్లోనే కలిసి పోతారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం కాస్త సంచలనంగా మారిపోయింది  అయితే ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. వరదలను కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కేవలం చంద్రబాబుకు మాత్రమే చెల్లుతుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చినప్పుడు కనీసం బాధితులకు పరిహారం కూడా అందించలేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.


 ఇక ఎప్పుడూ చంద్రబాబు ప్రభుత్వం పై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ విమర్శలు గుప్పించే వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవలే సీఎం జగన్ గాల్లో కలిసి పోతారని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై స్పందించారు. ఏకంగా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గాల్లో కలిసి పోతారు అని చంద్రబాబు అనుచితచేశారు. అక్కడేచంద్రబాబు వక్రబుద్ధిప్రజలు అర్థం చేసుకున్నారు. ఎన్నికల్లో ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసిన చంద్రబాబు తీరు మారలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ తన భార్య గురించి మాట్లాడి మనిషివా చంద్రబాబు అనే పరిస్థితిని తెచ్చుకున్నాడు. బాధలో ఉన్న తనను వరద బాధితులు ఓదార్చాలి అని చంద్రబాబు అనుకుంటున్నారు అంటూ సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: