ఇటీవలే అసెంబ్లీలో జరిగిన ఘటన కాస్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కంటతడి పెట్టుకున్నారు. అంతేకాదు ఇక తాను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఇక అసెంబ్లీ లో అడుగు పెట్టబోను అంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు రాజకీయాలతో సంబంధం లేని తన భార్య గురించి వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడుతున్నారు అంటూ బోరున విలపించటం ఎంతో మంది మనసును కలచివేసింది.



 అయితే చంద్రబాబునాయుడు లాంటి రాజకీయ నేత కంటతడి పెట్టుకునేలా మాట్లాడటంపై టిడిపి శ్రేణులు అందరు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సినీనటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తూ మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకునేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా వార్నింగులు సైతం వచ్చారు. అయితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. మా ఫ్యామిలీ లోని మహిళలను కించపరుస్తూ మాట్లాడటం బాధించిందని... పాలన అంటే ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలని నొచ్చుకునే విధంగా ఉండకూడదని.. స్త్రీలను  గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ అంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.


 అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎవరి పేరు ప్రస్తావనకు తీసుకు రాకుండానే మాట్లాడటంతో టిడిపి నేతలు అందరూ కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా కొంతమంది తప్పుబడుతున్నారు. భువనేశ్వరిపై అసెంబ్లీలో అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసిపి నేతలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు ఏమాత్రం సరిగ్గా లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. సింహాద్రి ల స్పందిస్తారు అనుకుంటే చాగంటిలా ప్రవచనాలు చెప్పారు అంటూ వ్యాఖ్యానించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులే కదా వారిని ఎందుకు హెచ్చరించలేదు అంటూ వర్ల రామయ్య ఈ సందర్భంగా ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు నిజమేనని బుద్ధ వెంకన్న సహా మరి కొంతమంది టిడిపి నేతలు కూడా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: